ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనంSample
దీనులు ధన్యులు
ఈ సందర్భంలో పేదలు ఆధ్యాత్మికంగా పేదలుగా ఉన్నవారు అని పిలువబడుతున్నారు. వారి జీవితంలో క్రీస్తు లేకుండా వారు ఆధ్యాత్మికంగా ఋణగ్రస్తులుగానూ, శూన్యంగానూ ఉన్నట్టు తెలిసినవారు. ఆత్మలో ఉన్న పేదలు దేవుని కోసం తమ అవసరాన్ని తెలిసిన వారు, ఆయనపై నిరాశాజనకంగా ఆధారపడతారు. యేసు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, దేవుని రాజ్యం వారిది. దీన్ని ఊహించండి. - తమంతట తాముగా అర్హతలేనివారు అని తెలిసిన వారూ, ప్రతీ దాని విషయంలో రాజుపై తీవ్రంగా ఆధారపడిన వారిలో ప్రతీ ఒక్కరికీ దేవుని రాజ్య వారసత్వం చెందుతుంది.
ఈ రోజు, మీరు ఆత్మలో ఎంత దీనులుగా ఉన్నారు? మీలో క్రీస్తు పరభువు మహిమ నిరీక్షణ అని మీరు గుర్తించారా? (కొలొస్సయులు 1:27), ఆయనతో లేకుండా మీరు ఏమీ చేయలేరని గుర్తించారా? (యోహాను 15:5)
యేసు మిమ్మల్ని సహ-ఆధారితులుగా చూడడు, పేదరికంతో బాధపడుతున్న ఆత్మగా చూడడు. ఆయన మిమ్మల్ని గొప్ప కరుణతోనూ, ప్రేమతోనూ చూస్తాడు, మిమ్మల్ని అనంతమైన శక్తివంతులుగా చెయ్యడానికి మీరు బలహీనంగా ఉన్న చోటునుండి కదిలిస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఆయన్ని అడగడమే!
About this Plan
క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.
More