యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాంSample
ఈ సంస్కృతిని మనం లోకంలోనికి తీసుకొనివెళ్ళడం
మనం కలుపుకొనే స్వభావంతోనూ, కరుణ, నిస్వార్ధం గురించి బుద్ధిపూర్వకంగా ఉన్నప్పుడు, ప్రజలు ఎటువంటి నేపథ్యాన్ని కలిగియున్నప్పటికీ, ఎటువంటి స్వరూపం కలిగియున్నప్పటికీ, ఎటువంటి నడవడిక ఉన్నప్పటికీ వారితో సంబంధపరచుకోవడం, వారితో జతకలవడం సులభం అవుతుంది. వారితో మనకు ఉమ్మడి అవగాహనను కనుగొంటాం, మన మధ్య ప్రేమ కలిగే మార్గం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ప్రేమకు తక్కువ విలువ ఇవ్వబడుతుంది, అధికంగా వినియోగించబడుతున్న పదంగా మారిపోయింది. అయితే దాని వాస్తవ అర్థం ఏమిటి? ప్రేమ పదం ఒక క్రియా పదం – అంటే మనం ఇతరులను ప్రేమిస్తున్నామని కేవలం మాటలతో పలకడం కాదు దానిని మనం చర్యలలో చూపిస్తాము. ప్రజలకు సేవ చెయ్యడం, వారితో మృదువుగా ఉండడం, అదనంగా వారికోసం నడవడం ఇటువంటి ప్రేమను కనుపరుస్తుంది. ప్రేమించడానికి కష్టమైనదానిని ప్రేమించడం, ఆలోచించలేనిదానిని క్షమించడం, మన మీద ఉమ్మి వేసినవారి కోసం ప్రార్థన చెయ్యడం సంస్కృతికి విరుద్ధమైనది, మన ప్రవృత్తికీ, సహజ గుణానికీ వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ఆసాధ్యం కాకపోయినా మన దేవుని సహాయంతో మనం దేవుని ప్రేమతో ప్రజలను ప్రేమించగలం. ఈ సంస్కృతిని సంఘానికి మాత్రమే పరిమితం చెయ్యలేం, అయితే మనలో లోతుగా చొరబడాలి, మనం వెళ్ళే అన్ని స్థలాల్లో, అది బోర్డు రూమ్ కావచ్చునూ, స్టూడియో కావచ్చునూ, కళాశాల ప్రాంగణం కావచ్చునూ, జిమ్ గానీ మన తల్లిదండ్రుల సమావేశం గానీ మనం ఎక్కడికి వెళ్ళినా అది మనలను అనుసరించాలి. అనేకులు యేసును చూడాలనుకొనే మొదటి చూపుగా మనం ఉండాలి. వారి మొదటి అభిప్రాయం శ్రేష్టమైనదిగా ఉండాలి, తద్వారా వారు ఆయనను గురించి మరింత అధికంగా తెలుసుకొంటారు!
Scripture
About this Plan
బైబిలు గ్రంథం మన అద్దంగా బైబిలుతో మనల్ని మనం అధ్యయనం చెయ్యడానికి యోనా గ్రంథం ఒక గొప్ప మార్గం, దాచబడిన మన పూర్వభావనలనూ, లోపాలనూ కనుగొంటూ, దేవుడు మనలను ఉంచిన స్థలాలలో దేవునికి శ్రేష్ఠమైన రీతిలో సేవచేయ్యడం గురించి తెలుసుకోవడం.
More