YouVersion Logo
Search Icon

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాంSample

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

DAY 4 OF 5

సేవా సంస్కృతి

యోనా తీవ్రమైన తన స్వార్ధపూరిత వ్యాధికి గురుతులను ప్రదర్శిస్తున్నాడు. “పాపులైన” మనుష్యులకు బోధించడానికి బదులు సముద్రంలో మునిగిపోడానికి కోరుకొంటున్నాడు, దేవుని కరుణ విషయంలో ఆయన దూషించడంనుండి తనకు నీడనిచ్చే చెట్టును తొలగించినందుకు ఆయన నిందించేవరకూ తన లక్షణాలను చూపించాడు. తనకు తానుగా ఉండే వ్యక్తికి యోనా ఒక నమూనా. “నా మార్గం, లేక రాజమార్గం” అనే విధానంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తన దారికి రానివాటినన్నిటినీ పరిష్కరించుకోగలడు, దేవుడు తనను నిరుత్సాహపరుస్తాడని అతనికి తెలుసు.  

విస్తృతమైన రూపంలో చూడడానికి బదులు అతని శత్రువుల యెదుట తీవ్రమైన వేడిమిలో నశించిపోవడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ చిత్రం తన గురించి కాదు, నినెవేలోని తన ప్రజలూ, జంతువుల కోసం విమోచించే దేవుని ప్రేమను గురించి చెపుతుంది. ఈ వృత్తాంతం అంతటిలో ప్రవక్తఅయిన తన సందేశంలోని ఒక్క మాటను పూర్తిగా ఆధారం చేసుకొని ప్రజలు పశ్చాత్తాపపడడం ద్వారా యోనా అప్రయోజకత్వం తీవ్రం చెయ్యబడింది. సందేశం అస్పష్టంగా ఉంది, పొడిగా ఉండేలా నిగూఢంగానూ పెళుసుగానూ ఉన్నప్పటికీ అది లక్ష్యాన్ని తాకింది.  

తరచుగా మనం మన గురించి సువార్తను తయారుచేసుకొంటాం. సంఘాన్ని మన కోసం తయారుచేసుకొంటాం. వాస్తవానికి అది కాదు! సువార్త అంటే సమస్త మానవాళి కోసం ప్రభువైన యేసును గురించీ, వారిపట్ల ఆయన ప్రేమను గురించి పంచుకోవడమే.  కల్వరి సిలువలో ఆయన బలియాగాన్ని గురించీ, మరణం నుండి ఆయన పునరుత్దానం గురించే చెప్పేదే సువార్త. ఈ పునరుత్దానం ద్వారా మనకు నిత్యత్వం భద్రపరచబడింది. మానవాళి సమస్యలకు దేవుని జవాబు దేవుని సంఘం. సంఘం కర్తవ్యం నశించిన వారిని యేసునొద్దకు స్వాగతించడం, వారిని ఆయన వద్దకు నడిపించడం. 

కొరింతు సంఘంలో వివిధ గుంపులు వివిధ అపొస్తలులకూ, నాయకులకూ సంబంధించబడియుండడం ద్వారానూ వారు ప్రభువైన యేసు సమస్తానికి కేంద్రం అని మరచిపోవడంద్వారానూ ఆ సంఘం విభజించబడింది. వారి విశ్వాసానికీ, పరిణతకూ పౌలూ, అపొల్లోలు కీలకంగా ఉండగా, వారు దేవుని చేతిలోని పనికోసం వారు దేవుని చేతలోని సాధనాలుగా ఉన్నారు. దేవుడు, కేవలం దేవుడు మాత్రమే మనుష్యులకు రక్షణను కలుగజేయువాడు. సంఘానికి ఎదుగుదల కలుగజేయువాడూ ఆయనే. ఇది కేవలం పరిశీలకులూ, వినియోగదారులుగా ఉండడం కాకుండా జట్టు సభ్యులుగానూ, సహకరించేవారిగానూ ఉండేలా మనం వైఖరిని మార్చాలి.  పరివర్తన పరిశుద్ధాత్మ ద్వారా తీసుకొనిరాబడుతుంది. దేవుడు మన ద్వారా పనిచేసేలా మనం కేవలం మాధ్యమాలం మాత్రమే. ఆయన మన ద్వారా పనిచేసేలా మనం అనుమతించాలి. రోమా పత్రిక 15అధ్యాయంలో 1, 2 వచనాలు ఇలా చెపుతున్నాయి, “బలం సేవ కోసమే, స్థాయి కోసం కాదు, మనలో ప్రతి ఒక్కరమూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగునట్లు చూడాలి, “నేను ఏవిధంగా సహాయపడగలను?” అని మనలో మనం ప్రశ్నించుకోవాలి. 

స్వార్ధం క్రీస్తు శరీరం కార్యాన్ని నిలిపివేస్తుంది. క్రీస్తు శిష్యులంగా ఇతరులకు నిస్వార్ధంగా సేవ చెయ్యాలి. వారిలోనూ, వారి ద్వారానూ దేవుణ్ణి పనిచెయ్యనివ్వాలి. 

Day 3Day 5

About this Plan

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

బైబిలు గ్రంథం మన అద్దంగా బైబిలుతో మనల్ని మనం అధ్యయనం చెయ్యడానికి యోనా గ్రంథం ఒక గొప్ప మార్గం, దాచబడిన మన పూర్వభావనలనూ, లోపాలనూ కనుగొంటూ, దేవుడు మనలను ఉంచిన స్థలాలలో దేవునికి శ్రేష్ఠమైన రీతిలో సేవచేయ్యడం గురించి తెలుసుకోవడం.

More