YouVersion Logo
Search Icon

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాంSample

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

DAY 2 OF 5

కలుపుగోలు సంస్కృతి

ఎంపిక చెయ్యబడిన ఇశ్రాయేలీయుల ప్రజలకు యోనా ఒక ప్రవక్త. లేక యోనా ఆవిధంగా తలంచాడు. అతడు రాజు పట్ల భక్తి కలిగి యన్నాడు, తన దేశం లోని ప్రజల పట్ల కూడా నమ్మకాన్ని కలిగియున్నాడు. కాబట్టి రక్షణ పొందని ప్రజలూ, భీతిని కలిగించే ప్రజలూ ఉన్న పొరుగు దేశానికి వెళ్ళమని దేవుడు కోరినప్పుడు, అతను మొదట కలవరపడ్డాడు, తరువాత కఠినపరచుకొన్నాడు, కలుపుకోలేకపోయే స్వభావం తాను సేవించే దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉంది. కలుపుకోలేని స్వభావం తన ప్రజల కోసం దేవుని ప్రణాళికలో ఒక భాగం కాదు. వాస్తవానికి, పునరుత్థానం తరువాత యేసు తన శిష్యులను మత్తయిలో “లోకమంతా వెళ్లి శిష్యులను చేయమని” ఆదేశించాడు. ఈ ఆదేశానికి పరిమితులు గానీ లేదా షరతులు గానీ లేవు. కలుపుకోలేని స్వభావం ఒక గుంపులో మరొక గుంపును సృష్టిస్తుంది, దేవుని రాజ్యానికి ఇది నష్టదాయకంగా ఉంటుంది. కలుపుకోలేని స్వభావం ఇతర జాతి ప్రజలనూ, సమాజంలోని వివిధ స్థాయిలనూ, కొన్ని సందర్భాలలో మన అభిప్రాయాలను తక్కువగా చూస్తుంది.  మనల్ని ఏకం చేసే వాటి మీద లక్ష్యం ఉంచడం కంటే మనల్ని విభజించే దానిపై దృష్టి పెట్టడం విభజనలకు కారణమవుతుంది. ఆదిమ సంఘం కూడా ఇటువంటి స్వభావంతో సమస్యకు గురైంది. ఇటువంటిది ఒక విష సంస్కృతిని సృష్టించే ముందు దానిని మొగ్గలోనే తుంచి వెయ్యాల్సిన అవసరం ఉంది. వేయాలి. పేతురు, బర్నబాలు ఇటువంటి కలుపుకోలేని స్వభావంలోనికి దారితప్పి వెళ్తున్న పరిస్థితులలో అపొస్తలుడైన పౌలు వారిని గుర్తించాడు. వారందరినీ రక్షించిన ఆధార వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వారిని హెచ్చరించాడు. , తద్వారా అందరినీ కలుపుకొని ఉండాలని వారిని బతిమాలాడు. దేవుని రాజ్య విస్తరణకు దుఃఖకరంగా ఆటంకం కలిగించే విధంగా కలుపుకోగలిగే వాతావరణాన్ని నివారించడంలో సంఘంగా మనం స్పృహ కలిగి ఉండాలి.

Day 1Day 3

About this Plan

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

బైబిలు గ్రంథం మన అద్దంగా బైబిలుతో మనల్ని మనం అధ్యయనం చెయ్యడానికి యోనా గ్రంథం ఒక గొప్ప మార్గం, దాచబడిన మన పూర్వభావనలనూ, లోపాలనూ కనుగొంటూ, దేవుడు మనలను ఉంచిన స్థలాలలో దేవునికి శ్రేష్ఠమైన రీతిలో సేవచేయ్యడం గురించి తెలుసుకోవడం.

More