YouVersion Logo
Search Icon

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాంSample

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

DAY 1 OF 5

యోనా గ్రంథాన్ని అధ్యయనం చెయ్యడం ఎలా?

యోనా గ్రంథం మిగిలిన ఇతర చిన్న ప్రవక్తల గ్రంథాల్లా ఉండదు, దీనిలో చీకటిని గురించీ, నాశనం గురించిన సందేశాలు లేవు. ఈ గ్రంథం తక్కువగా తెలిసిన ప్రవక్త జీవితాన్ని గురించీ, ఆయన జీవితంలో చోటుచేసుకొన్న మలుపులూ, మార్పులను గురించిన ఒక వ్యాసంలా ఉంది. ఈ గ్రంథాన్ని అధ్యయనం చెయ్యడం అంటే ఒక అద్దాన్ని ముఖం వద్ద ఉంచుకొని నిన్ను నీవు సమీపంగా చూసుకోవడమే. యోనా ప్రత్రిచర్యలు చూపించడమూ, ఆయన ప్రవర్తన విధానం మనకు భిన్నంగా ఉండదు. మనకు నాటకీయ పరిణామాలు జరుగక పోవచ్చును (ఒక చేప కడుపులో వెయ్యబడడం, మూడు రోజుల తరువాత బయటకు ఉమ్మి వెయ్యబడడం). అయితే ఒక నిర్దిష్టమైన గుంపు ప్రజలను ఇష్టపడకపోవడం. అటువంటి అసౌకర్య పరిస్థితులనుండి పారిపోవడానికి ప్రయత్నించడం లాంటి విషయాలలో మాత్రం మనం ఖచ్చితంగా సంబంధపరచుకోవచ్చును. ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక సూక్ష్మదర్శినితో చూచినట్టు దగ్గరగా మనల్ని మనం చూసుకొందాం. ఐక్యతనూ, సమాధానాన్నీ, ప్రేమను కలిగించని పరిస్థితులను పరిష్కరించవచ్చు. క్రీస్తు శరీరం దీనిని మీద ఆధారపడింది! 

Day 2

About this Plan

యోనా సంసంస్కృతిని పరిశోధిద్దాం

బైబిలు గ్రంథం మన అద్దంగా బైబిలుతో మనల్ని మనం అధ్యయనం చెయ్యడానికి యోనా గ్రంథం ఒక గొప్ప మార్గం, దాచబడిన మన పూర్వభావనలనూ, లోపాలనూ కనుగొంటూ, దేవుడు మనలను ఉంచిన స్థలాలలో దేవునికి శ్రేష్ఠమైన రీతిలో సేవచేయ్యడం గురించి తెలుసుకోవడం.

More