యేసుతో ముఖాముఖి预览

మీరు ప్రేమను ఏవిధంగా లెక్కిస్తారు?యేసు చెప్పిన ప్రకారం,ఎక్కువగా క్షమించబడినవారు ఎక్కువగా ప్రేమిస్తారు,అయితే తక్కువ క్షమించబడినవారు తక్కువగా ప్రేమిస్తారు. పాపభరితమైన జీవితాన్ని గడిపిన ఒక స్త్రీ యేసు ఉన్న విందుకు పిలవకుండా వచ్చింది, తన కన్నీళ్లతో మరియు ఖరీదైన పరిమళంతో ఆయనను అభిషేకించింది. ఈ స్త్రీకి తాను దైవ సన్నిధిలో నిలుచున్నాను అని, మరియు ఆయన మాత్రమే తన గురించి తెలుసుకోగలడని మరియు ప్రతిదాని విషయంలో తనను క్షమించగలడని ఆమెకు తెలుసు. ఆయన క్షమాపణ తెలుసుకోవడం ఆమెను మరింత భక్తి మరియు తన్ను తాను ఉపేక్షించుకొనే దాతృత్వానికి ఆమెను కదిలించింది. ఆ విధంగా విడిచిపెట్టబడినప్పటికీ ఆయనను ఆరాధించేంతగా మరేదీ ఆమెను కదిలించలేదు.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
ఆరాధన మీకు ఏవిధంగా కనిపిస్తుంది?
యేసు పట్ల మీకున్న ప్రేమను వర్ణించగలరా?
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More