యేసుతో ముఖాముఖి预览

మనం శ్రమలనువివరించడానికి ప్రయత్నిస్తాము లేదా కనీసం వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అనేక సార్లు,మనం వేటి ద్వారా వెళుతున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేదానికి వివరణ లేదు. మౌనంగా ఉండి,దేవుడు మనలో ప్రారంభించిన కార్యాన్ని సంపూర్తి చేయడానికి అనుమతించడం ఉత్తమం, తద్వారా ఆయన మహిమ మనలో మరియు మన ద్వారా వెల్లడవుతుంది. అంగీకరించడం ఎంత కష్టమైనప్పటికీ,విజయం కంటే శ్రమ మనకు మరింత మేలు చేస్తుంది. ఇది మన కఠినమైన అంచులను మెరుగుపరుస్తుంది,ఓర్పును పెంపొందిస్తుంది,మన ప్రార్థన జీవితాన్ని వృద్ధి చేస్తుంది మరియు మన జీవితంలో దేవుని కదలికకు మరింత సున్నితంగా ఉండేలా చేస్తుంది. ఈ రోజు వాక్యభాగంలోని వ్యక్తి వలే,మీ జీవితంలో లేదా మీ కుటుంబ క్రమంలో ఉన్న పాపం కారణంగా మీకు శ్రమలు ఉన్నాయని మీకు చెప్పవచ్చు. యేసు వద్దకు వచ్చి,మీ అసాధ్యమైన క్లిష్ట పరిస్థితి నుండి ఆయన మహిమను తీసుకురావాలని అడగడం మీ ఎంపిక.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
మీ శ్రమ ఏమీ లేదని మీరు భావించారా?
ఇంతవరకు మీ జీవిత కాలాలలో దేనినుండైనా మహిమ ఉదయించిందా?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More