యేసుతో ముఖాముఖి预览

పరిపూర్ణతకు దూరంగా ఉన్న మనుష్యుల సమూహం ద్వారా బహిరంగంగా తన మీద బహిరంగంగా తీర్పు విధించబడడానికి ఈ స్త్రీని యేసు దగ్గరకు ఈడ్వబడింది. యేసు వంగి నేలపై ఏదో రాస్తూ తన దృష్టిని ఆమెనుండి తీసివేసినప్పుడు ఆ స్త్రీ సిగ్గుతోనూ, అపరాధభావంతోనూ వణికిపోతుంది. సమూహంలో పాపం చేయని వ్యక్తులు ఆమెను రాళ్లతో కొట్టడం ప్రారంభించాలని ఆయన చెప్పాడు. ఒకరి తరువాత ఒకరు అక్కడి నుండి వెలుపలికి వెళ్లిపోయారు. యేసు ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టాడు అయితే ఆయన ఒక షరతు లేకుండా చేయడు- "వెళ్ళు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టు".
ప్రభువైన యేసు కృపకూ, సత్యానికీ సత్యం యొక్క సార సంగ్రహం. ఆయన ఎవరినీ ఖండించలేదు అయితే వారిని ఒప్పించకుండా ఆయన వెనుదిరగలేదు. పరిశుద్ధాత్మ కూడా ఈ రోజు అదే కార్యాన్ని చేస్తాడు. పరిశుద్ధాత్మ ఆ పాపపూరిత ధోరణుల గురించి మనలను హెచ్చరింఛి, మనలను నిజమైన పశ్చాత్తాపానికి తీసుకురావడం ద్వారా మనల్ని వేషదారులుగా ఉండకుండా, తీర్పు తీర్చు వైఖరితో మనం ఉండకుండా ఉండేలా చేస్తాడు.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
నేను ఇతరులను తీర్పుతీర్చుతున్నానా?
నేను ఇతరులను తీర్పు తీర్చకుండా మరియు నా స్వంత జీవితాన్ని దగ్గరగా చూడడానికి సమర్పించుకొని ఉండవచ్చా?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More