అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట నమూనా

All Is Calm: Receiving Jesus' Rest This Christmas

5 యొక్క 5

ఐదవ దినము: ఆయన విశ్వాస్యత యందు నమ్మికయుంచుము:

"నీవు నన్ను నమ్ముతున్నావా?"

అనుదినము మనము నిద్ర మేల్కొనిన క్షణము నుండి పండుకొన బోయే వరకు, ఈ ప్రశ్న మనలను ఎదురు కుంటూనే ఉంటాము. ఎందుకనగా, నమ్ముట అనగా విశ్రమించుట మరియు విశ్రమించుట అనగా నమ్ముటయై ఉన్నది.

దీని గురించి ఆలోచించుము: నీ క్రిస్మస్ చెట్టును ఒక కాలు విరిగిన తొట్టిలో వ్రేలాడదీయవు అలానే ఎప్పుడు ఆలస్యముగా వచ్చే వ్యక్తిని క్రిస్మస్ సంబరానికి కావలిసిన వంటకమును తీసుకురమ్మని అడగవు కదా.

మనము గ్రహించినా - గ్రహించకున్నా, మన చుట్టూ ఉన్న వస్తువుల మరియు వ్యక్తుల నమ్మకత్వమును అనుక్షణం మనము అంచనా వేస్తూనే ఉంటాము. దేవునితో మన సంబంధంలో కూడా అదే పని చేస్తాము, మనం ఆయనకు ఎంతవరకు అప్పగించాలో సూక్ష్మంగా చర్చలు జరుపుతాము.

అవి మన ఆర్థిక పరిస్థితులేమి, తెగిపోయిన సంబంధాలైతేనేమి, అంతరంగంలో దాగి యున్న గాయములైతేనేమి లేక మనము కలలు కనే భవిష్యత్తు అయితేనేమి, మన ప్రస్తుత కాలములో ఆయనను నమ్మవచ్చా లేదా అనునది గతములోని దేవుని విశ్వాస్యతను బట్టి అంచనా వేస్తాము.

కాని ఈ విధమైన సెలవు దినపు హడావిడి మధ్యలోనే మన యొక్క నమ్మిక లేక అపనమ్మిక స్పష్టమగును.

... మన యొక్క లోతైన హృదయ వాంఛలను తీర్చగల జీవాహారమైన యేసును మనం నమ్మనట్లయితే మనల్ని మనము వట్టి కేకులతో, పండుగ పిండి వంటలుతో మాత్రమే నింపుకుంటూ ఉంటాము.

... తప్పిపోయిన గొర్రెను తిరిగి ఇంటికి తీసుకువచ్చినమంచి కాపరియైనయేసును మనం నమ్మనట్లయితే తప్పిపోయిన మన కుమారుని గురించి చింతిస్తూనే ఉంటాము.

.. మన ఒంటరి సమయాలలో కూడా మనతో వసియించే దేవుడుగా ఉన్న ఇమ్మానుయేలైనయేసును మనం నమ్మనట్లయితే మరువబడిన వారివలె ఒంటరితనమును అనుభవిస్తూ ఉంటాము.

... మనలను పరిపూర్ణులుగా చేయగలదేవుని పరిశుద్ధుడైనయేసును మనం నమ్మనట్లయితే క్రిస్మస్ ను అందమైన వేడుకగాజరుపుకొనుకే ఆరాట పడుతూ ఉంటాము.

కొన్ని కోట్ల చిన్న చిన్న మార్గాలలో, దేవుని విశ్వాస్యతను నమ్ముటకు ప్రతి క్షణమూ ఒక నూతన అవకాశమే మరియు ఇదంతా ఆయన యందు విశ్రమించుటను నేర్చుకొనుట ద్వారా ప్రారంభమగును.

మన హడావిడి రోజుల్లోకి వేగంగా దూసుకెళ్ళే బదులు, అసలు ప్రతిరోజూ ఉదయాన్నే ఆయనలో విశ్రాంతి తీసుకోవటం ప్రారంభించినట్లయితే ఎలాగుండును? ఆయన చేసిన కార్యములను, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన పట్ల మన తీరని అవసరాన్ని వ్యక్తపరచటానికి, మన మనస్సులను, హృదయాలను ఆయన సన్నిధిలో నిమ్మళపరచుకోవడానికి మరియు ఆయన విశ్వాస్యతయందున్న మన నమ్మికను ప్రకటించడానికి: కీర్తనకారుడు చేసినట్లుగా, మన ప్రాణములను ఆయనలో మాత్రమే విశ్రాంతి పొందమని ఆదేశిద్దాం.

ఎందుకనగా ప్రపంచాన్నే ఉనికిలోకి తెచ్చిన దేవుడు, ఆ పవిత్రమైన, ఆనందకరమైన, నిశ్శబ్ద రాత్రివేళ, ఒక సాధారణ నిస్సహాయ శిశువుగా వచ్చెను, ఈ రోజు మన జీవితాల్లో కూడా తన ప్రశాంతతను మరియు శాంతిని మాట్లాడగలడు.

ప్రతిస్పందించే ప్రశ్నలు:యేసు నామములలో ఏది మీతో మరియు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లతో మాట్లాడెను? ఈ క్రిస్మస్ పండుగ వేళలో దేవునిని విశ్వసించడం మరియు ఆయనలో విశ్రాంతి తీసుకోవడం ఎలా ఉంటుంది? క్రొత్తగా మీరు ఏమి చేస్తారు?

ఇంకా కావాలా?డౌన్లోడ్ అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్యేసు యొక్క నామముల పట్టికను పొందుకొనుము, విశ్రాంతి ప్రార్థన సూచిక, క్రిస్మస్ విశ్రాంతికొరకు అచ్చువేయబడిన ప్రార్థన


రోజు 4

ఈ ప్రణాళిక గురించి

All Is Calm: Receiving Jesus' Rest This Christmas

ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు మూడి పబ్లిషర్స్ వారికి మా కృత్ఞతలు. మరింత సమాచారం కోసం http://onethingalone.com/advent దర్శించండి