అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట నమూనా

All Is Calm: Receiving Jesus' Rest This Christmas

5 యొక్క 2

రెండవ దినము: దేవుని మంచితనమును గుర్తు చేసుకొనుము

అసలు దేవుడు ఏమైయున్నాడో మరియు ఆయన మన కొరకు ఏమి చేసెనో దిన దినము మరచిపోతూ, మనందరము మతిమరుపుతో బాధపడుతున్నాము. మీ వలె, ప్రతి సంవత్సరము యేసు ఎవరో మరియు ఆయన పుట్టుక ఎందుకు అంత అద్భుతమో నాకు కూడా గుర్తు చేసికొనవలసిన అవసరమున్నది - ఈ తలంపు నా మదిలో లేనందుకు కాదు కాని నా హృదయము దీని విషయమై సామ్బ్రమము చెందుట మానివేసింది. పాత సామెతలో ఉన్నట్లుగా, అతి సాన్నిహిత్యం ధిక్కారాన్ని పెంచుతుంది అను విధముగా, విచారకరముగా మన సొంత హృదయాలే ఈ అద్భుతము భావాన్ని కోల్పోయాయి.

దేవుని అద్భుత కార్యములను క్రమముగా గుర్తు చేసుకుంటూ ఉండాలని ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపింపబడుటకు ఇదొక కారణమై ఉంది: ఎందుకనగా, తాము మరియు తమ సంతానము వాటిని మరచి పోకుండా ఉండుటే కాక, ఆయన యొక్క సాన్నిహిత్యము మరియు శక్తియు వారి మదులలో ఎప్పటికి నూతనమై మెదలాడుతూ ఉండుటకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది.

ఈ క్రిస్మస్ పండుగ కాలము కొరకు మరియు దానితోటి వచ్చే సిద్ధపాటు కార్యక్రమముల కొరకు ఎదురుచూస్తుండగా, మన యొక్క చిన్నపాటి శీతాకాలపు సరదాలను సృష్టించుకోవడంలో సులువుగా ఇరుక్కుపోతాము. కావున ఆయన ఏమైయున్నాడో మరియు ఆయన ఏమి చేసియున్నాడో, ఈ రెండిటిని తెలిపే ఆయన యొక్క మంచితనమును గుర్తు చేసుకోవాలని మనము దృఢముగా నిశ్చయించుకోవాలి.

ఇలా గుర్తు చేసికొనుటకు యేసు యొక్క నామములను ధ్యానించుట అనునది ఒక అద్భుతమైన మార్గము, అనేక విధాలుగా ఆయన ఇప్పుడు కూడా మనకు సమీపముగా ఉన్నాడని గమనిస్తూ, క్రిస్మస్ పండుగ కాలము యొక్క మాధుర్యమును అనుభవిద్దాము.

సూర్యకాంతిలో మిల మిల మెరుస్తున్న ఒక చక్కటి నునుపైన వజ్రమువలె, యేసు యొక్క నామములను ధ్యానం చేయునప్పుడు ఆయన వ్యక్తిత్వములోని అనేక కోణాలను మనము కనుగొని ఆరాధించగలము, అవి ఒక్కొక్కటి దేనికదే సాటి అయినప్పటికి, వాటన్నిటిని కలిపి చూసినప్పుడు, మనలను రక్షించుటకు మానవునిగా చేయబడిన మనుష్య కుమారుని యొక్క దివ్యమైన రూపముగా ఆవిష్కరించబడుతుంది.

కావున కాసేపు విరామము తీసుకొని మన రక్షకుని గురించి బహు తరచుగా వర్ణించే ప్రవచనాలలో వివరించబడిన యేసు యొక్క నామములను ధ్యానిస్తూ దేవుని మంచితనమును జ్ఞాపకము చేసుకోవాలని మిమ్మును ఆహ్వానిస్తున్నాను:

యేసేఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై యున్నాడు, మన సృష్టికర్త సమస్త మహిమ, ప్రభావము మరియు అధికారమును కలిగియున్నప్పటికి మనతో సహవాసమును సమకూర్చుటకు మరియు ఆయన ప్రియమైనవారితో వసియించుటకు, ఒక పసి బాలుని వలె ఈ భువికేతించుటకై ఎంచుకున్నాడు.

యేసేదేవుని వాక్యమై యుండెను, పరిపూర్ణ ప్రత్యక్షత మరియు దేవుని యొక్క జ్ఞానవంతమైన సంభాషణ, ఎవరైతే దేవునిని వెదికెదరో వారందరికీ అందుబాటులో గల అత్యంత వ్యక్తిగతమైన మరియు సూటిగా ఇవ్వబడిన సందేశము.

యేసేదేవుని పరిశుద్ధుడు, ఘనతలో శ్రేష్ఠుడు మరియు అధికారములో ఉన్నతుడు, ఆయన పరిశుద్ధత మనలను భయకంపితులను చేయక నిరీక్షించుటకు మనకు కారణమునిచ్చును ఎందుకనగా ఆయన మాత్రమే మనలను దైవిక నీతితో కప్పుతూ మరియు సమాధానమును మనకందించిన పాపము లేని పరిపూర్ణుడు.

ఆహ్వానము:యేసు యొక్క ఏ నామము మీకు ప్రత్యేకముగా నిలిచింది? నిమ్మళముగా ఆయన వ్యక్తిత్వములోని శ్రేష్ఠతను గూర్చి ధ్యానించండి, ఆపై మీరు ఈ దినమందు ఏ పరిస్థితి యందు నిలచియున్నారో దానియందు ఆయన నామము సార్ధకమైన కొన్ని నిర్దిష్ట మార్గములను పఠించండి లేక వ్రాయండి.

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

All Is Calm: Receiving Jesus' Rest This Christmas

ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు మూడి పబ్లిషర్స్ వారికి మా కృత్ఞతలు. మరింత సమాచారం కోసం http://onethingalone.com/advent దర్శించండి