అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట నమూనా
మూడవ దినము: మీ అవసరతను తెలియజేయండి:
"ధన్యవాదములు, కాని నేను చేయగలను."
మీరెప్పుడైనా మీకు అవసరత ఉన్నప్పటికి, మీకు అందివచ్చిన సహాయమును తృణీకరించారా?
కొన్నిసార్లు, మనంతట మనము అన్ని పనులు చేయలేమని అంగీకరించుట కష్టతరముగా ఉండును. మన క్రిస్మస్ సిద్ధబాటు కార్యక్రమాలన్నిటిలో, ఇది పలుమార్లు అలసటకు మరియు విసుగు నకు దారి తీయును. కాని ఈ విధమైన స్వయం భావమే మన ఆత్మీయ జీవితములలో హానికరముగా మారును.
సత్యమేమనగా మనకు యేసు అవసరము. కాని మనము తరచుగా మనంతట మనమే అన్ని చేయగలమనే తీరులో జీవిస్తూ ఉంటాము. దేవుని మహిమా సౌందర్యమైన -ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమ, ఆయన కరుణా వాత్సల్యములను ధ్యానించుటకు మనము సమయము కేటాయించేంత వరకు-మనకు ఆయన ఎంత అవసరమో మనము గ్రహించలేము. మన యొక్క అవసరతను తెలుపుటలో ఒక నిస్సహాయ స్థితిని కనుపరచినప్పటికి, ఆత్మ యందు దీనులైన వారికి, సాత్వీకులకు మరియు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని దేవుడే సంతృప్తిపరుస్తాడని యేసు వాగ్దానమిచ్చెను.
దేవుడు మన కొరకు సిద్ధపరచిన క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములను పొందుకొనుటకు కేవలము మన అవసరతను ఆయనకు తెలుపుట అను మార్గమొక్కటే ఉన్నట్లు కనిపిస్తుంది.
దేవుని ప్రజలు తమ సృష్టికర్త యెదుట మొకాళ్ళూని సాష్టాంగపడి ఆరాధించాలని కీర్తనాకారుడు పిలుపునిచ్చెను. ఆరాధన అను పదమునకు హీబ్రు భాషలో సాష్టాంగ పడుట అను అర్థమిచ్చును. భౌతికంగా, మన మొకాళ్ళూని యేసయ్య యొక్క దైవత్వమును అంగీకరించుట; ఆత్మీయంగా, మనము ఏమైయున్నామో సంపూర్ణముగా ఆయనకు సమర్పించుట అని తెలుపుచున్నది.
దేవుని గొప్పతనాన్ని గుర్తించడానికి మొదట మనము సమయాన్ని వెచ్చించినప్పుడు మాత్రమే ఈ రకమైన దృక్పథం మరియు ప్రాధాన్యతలను మార్చడం సాధ్యమవుతుంది; ఆరాధన మనలను సరైన దేవుని దృక్పథానికి, అదేమనగా పాపపు ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపం వైపు ఇది మనలను నడిపిస్తుంది.
యేసు తాను నిజమైన ద్రాక్షావల్లినని అని, మరియు ఆయన శిష్యులు కొమ్మల వంటి వారని పిలిచినప్పుడు ఇదే విషయాన్ని వివరిస్తాడు. "నాకు వేరుగా ఉండి, మీరేమియు చేయలేరు" అని ఆయన వారికి చెప్పును."ఎవడు నాయందు నిలిచియుండునో… వాడు బహుగా ఫలించును". ఆశ్చర్యకరంగా, ఆయన మనలను ఫలించుటకు మరింత కస్టపడి పని చేయమనలేదు కాని ఆయన యందు నిలిచి యుండుమని, ఆయన యందు వేచియుండమని చెప్పెను. ఆయనతో అనుసంధానించబడిన వారు సహజంగానే అధికంగా ఫలిస్తారు, ఎందుకంటే ఆయన ఆత్మ వలెనే ఫలములు ఉత్పత్తి అవుతాయి.
ధ్యానించవలసిన ప్రశ్నలు:ద్రాక్షావల్లిగా యేసు యొక్క వర్ణన మిమ్ములను ఏ విధముగా ప్రభావితం చేస్తుంది? యేసు కొరకు మీ స్వంత అవసరతను గుర్తించడానికి ఆయన యొక్క ఏ ఇతర పేర్లు మిమ్మల్ని ప్రేరేపించాయి? ఈ రోజు మీరు మీ అవసరతను వ్యక్తపరచి ఆయనలో విశ్రమించగల ఒక మార్గం ఏమిటి?
ఈ ప్రణాళిక గురించి
ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.
More