నిరీక్షణనమూనా
- నా జీవితములో విషయాలు ఇలా జరుగవు అనుకునేంతగా అద్వాన్నంగా మారుతాయా..అని అనుకొనిన రోజులు గలవు.
అయ్యితే ఆ సమయాలు..నిరీక్షణ లేని సమయాలు,ఆశ విడిచిన తరుణాలు..
"పరిస్థితులు అలానే ఉంటే నేనింక ముందుకు వెళ్లగలనో,లేదో నాకిక తెలియదు అని ఆలోచించాను."
వెనుకకు తిరిగి చూస్తుంటే నేను స్పష్టముగా చూడగలుగుతున్నాను.
ఆ అనుభవాలన్నీ నాకేమి చెప్పాయి అంటే,
నేను చూడకపోయినప్పటికీ కూడా-దేవుడు వాటన్నింటిలోను నాతో ఉండి ఉన్నారు అని.
నేను ఆయన ప్రణాళికలను నిన్నటికంటే ఈ రోజు బాగా స్పష్టముగా చూడగలుగుతున్నాను.
ఇది నాకు ఆశ(నిరీక్షణ) కలిగించింది.
దేవుడు అన్నిటినీ జాగ్రత్తగా పట్టించుకుంటూనే ఒక ప్రణాళిక కలిగియున్నాడు.దేవుని నమ్ముము.ఈయన నమ్మదగినవాడు.
Jeremiah 29:11 - Jeremiah(యిర్మీయా) 29:11
11.నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
నీవు ఎప్పుడైనా ఇలా ఆలోచించినావా?:-ఎవ్వరూ నన్ను నిజంగా ఇష్టపడటం లేదు అని,నేనిదే ఊరకనే ఊదుతూ ఉండేవాడిని?,నాకు తెలుసు..నా మార్గమంతటిలో మనస్తాపం చెందినవారున్నారు అని నాకు తెలుసును.పాపము(దోషము,నేరము,అపరాధము,తప్పు) బాగా పెరిగిపోయెను,స్వీయ సందేహం,నాపట్లనాకే ధిక్కారం ఉండేవి.ఇక్కడే విషయము గలదు.దేవుడు అందరికంటే ఎక్కువగా నాగురించి తెలిసినవాడు.ఆయన నన్ను తయారుచేసినవాడు(సృష్టికర్త).ఆయన నా మనస్సును సృష్టించి, నాకు నోరు ఇచ్చినవాడు.ఆయన నన్ను ప్రేమించడం ఎప్పుడూ ఆపడు.ఆయన ఎప్పటికీ నాకు నమ్మకముగా కట్టుబడి ఉన్నాడు.ప్రతీరోజూ కూడా దేవునితో క్రొత్త ప్రారంభమే.
Lamentations 3:22-23 - Lamentations(విలాపవాక్యములు) 3:22,23
22.యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
23.అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
కొందరు అంటారు చూడటం=నమ్మటం అని,
అలా కాదు, నమ్మడం=చూడటం అవుతుంది.
ఎప్పుడైతే నా ప్రభువును,రక్షకుడునైన "యేసుక్రీస్తు"వారిని నమ్మానో,అప్పుడు నా ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి. ఇప్పుడు అదే నిజమైన నిరీక్షణ.
Romans 8:24-25 - Romans(రోమీయులకు) 8:24,25
24.ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?
25.మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.
విరిగిన మనస్సుతో ఉన్నారా?,కృంగినవారిగా,అనగారినట్లు ఉన్నారా?,
మంచిది,నేను కూడా అలాంటి స్థితిని దాటుకునే వచ్చాను,మీకులానే విచారపడ్డాను,సతమతమయ్యాను,కానీ ఈ పరిస్థితి తాత్కాలికంగా ఉండేది మాత్రమే,మీరు ఇది నమ్మకపోవచ్చును:యేసుక్రీస్తు ఎవరికోసము అభిషేకింపబడ్డారో ఆ వ్యక్తి మీరే.
ఆయన ఆ పనిలోనే ఉన్నారు.
ఆయన యొద్ద మీరు నమ్మడానికి మరియు హృదయపూర్వకంగా తీసుకోవడానికి ఆ జైలు నుండి మిమ్మల్ని బయటికి తీసే గొప్ప సందేశము యున్నది.
నీవు ఆయనను అంగీకరించి,నమ్మిన యెడల వీటి అన్నిటినుండీ స్వేచ్ఛ(విడుదల) మరియు సంపూర్ణ నిరీక్షణ పొందెదవు.
Isaiah 61:1
ఈ ప్రణాళిక గురించి
నిరీక్షణ బైబిలులో నుండి నిరీక్షణను గురించి కొన్ని వాక్యాలు చూద్దాము. మీరు సమాధానము, నిర్భయము, సంపూర్ణ విశ్వాసము మరియు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు కదూ? మీరు విచారముతోనూ, వ్యాకులతతోనూ, కోపోద్రేకులై ఉండాలని ఆయన ఎప్పుడూ కాంక్షించడు. నిరీక్షణను గురించిన వాక్యాలు మీకు మరింత క్షమాగుణము కలిగియుండుట నేర్పుతాయి. దేవుని వాక్యమును ధ్యానము చేయుటవలన జ్ఞానము లభిస్తుంది.
More
Bible Memory System ఐనటువొంటి MemLok వారు ఈ ప్రణాళికకు రూపకల్పన అందించినందు వలన వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.MemLok.com దర్శించండి.