నిరీక్షణనమూనా

Hope

3 యొక్క 1

  • మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు దేవుని మహిమపరిచేందుకై ఎప్పుడైతే స్తుతి చేయుదురో అప్పుడే మీలో ఎక్కువైన నిరీక్షణ కలుగుతున్నది అని. నిరీక్షణ మరియు దేవుని స్తుతిస్తూ ఘనపర్చుట ఒకదానికి ఒకటి విడదీయరాని సంబంధము కలిగియున్నవి. ఇప్పుడే దేవుని ఏదో ఒక విషయమై స్తుతిస్తూ ఘనపరచండి.ఒకవేళ మీరు తక్కువ నిరీక్షణ గలవారుగా ఉంటే అలా చేయడంవలన మీ నిరీక్షణ ఫలం అభివృద్ధి చెందుతుంది.నిరీక్షణ అనేది ఒక ఎంపిక. నిరాశను కాదు, ఆశ అనగా "నిరీక్షణ"ను ఎంపికగా ఎంచుకోండి. మీరు ఆశ(నిరీక్షణ) మరియు నిరాశ రెండింటిని ఎంపికగా ఎంచుకోలేరు.ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి.ఇది మీరు ఎంచుకోవల్సినది. దేవుడు నమ్మదగినవాడు.దేవుడు మంచివాడు. Psalm 71:14
  • Psalms(కీర్తనలు గ్రంథము) 71:14 14.నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును మీ యొక్క కోరికలన్నిటినీ దేవుడు నెరవేర్చగలరు.మీరొకవేళ కృంగినవారిగా నిరాశాజనకంగా ఉండినట్లయితే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నేను దేవునితో పాటూ మరి ఇంకేదో ఆశిస్తూ ఉన్నామా? అని. కనిపించే ఏదీ కూడా అసలైన నిరీక్షణ కలిగించేది కాదు.మీరు వ్యక్తులు లేదా విషయాలు లేదా సంఘటనలపై ఆశలు పెట్టుకున్నప్పుడు మీకు అనారోగ్యమైన పరిస్థితి కలుగుతుంది.వేచి ఉండటం కఠినమైనది. మరియు చాలా క్లుప్తంగా పరిపూర్ణమైతే తప్ప మరేమీ సంతృప్తి చెందదు.మీ కోరికలన్నీ దేవుడు తీర్చగలడు!
    Proverbs 13:12
  • Proverbs(సామెతలు) 13:12 12.కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. శత్రువైన సాతాను మీ చెవిలో ఇలా గుసగుసలు వినిపిస్తాడు:- "నేను ఎంత నిరీక్షణ లేని స్థితిలో ఉన్నానో ఎవ్వరూ అర్ధము చేసికోలేరు అని." అది ఒక అబద్ధము.అది గనుక మీరు నమ్మినట్లైయితే మీ మీద మీరే జాలిపడ్తూ, మీలో మీరే మదనపడ్తూ ఉండే వ్యక్తిగతమైన జాలి పార్టీని అనుమతించిన వారవుతారు.కానీ మీరు ఒక్కరుగా మిగిలిపోలేదు.దేవుడు అర్ధము చేసికోలేరు అని మీరు ఆలోచిస్తున్నారు గానీనా?,మీ గుండె విరిగిపోయిందని మళ్లీ మళ్లీ ఆయనకు చెప్పి దేవుని విసిగించడం ఎందుకు అని అనుకుంటున్నారా?.దానిని(నిరాశాజనకంగా ఉండే శత్రువు గుసగుసలు) ఎప్పుడూ నమ్మొద్దు, దేవుడు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు.ఆయన మీరు కొనసాగేందుకు బలాన్ని ఇస్తారు.దేవుడు మిమ్మల్ని మరింత ఆశాజనకంగా బలోపేతం చేస్తారు.
    Isaiah 40:28-29
  • Isaiah(యెషయా గ్రంథము) 40:28,29 28.నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 29.సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. మనిషి ఇలా చెప్తారు:-"కొన్ని విషయాలు దేవునికి సాధించటం అసాధ్యం అనిపిస్తుంది." బాగా, ఈ చంచలమైన దృక్కోణం మనిషిలోనిదే కాదా?,కాగా అది అలా ఉండగానే మనం ఈ అబద్దానికి బాధితులం అవుతున్నాము.మనం క్రమం తప్పకుండా, తరచుగా ఎప్పటికప్పుడే, "దేవుని ఉద్దేశ్యం నిరోధించబడదు" అని గట్టిగా నొక్కి చెప్పాలి.విశ్వం యొక్క సృష్టికర్త ఓడిపోడు.ఏది మంచిదో,శ్రేష్ఠమైనదో ఆయనకు తెలుసే యుండును. ఈ రకమైన విశ్వాసము "నిరీక్షణ" కలిగించి ఆశావహ దృక్పధం కలిగిస్తుంది.
    Job 42:2

Job(యోబు గ్రంథము) 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. పై బైబిలు మాటలు మా మొబైల్ అప్లికేషన్,Mac లేదా విండోస్ ప్రోగ్రామ్ లందు గలవు.మరిన్ని వివరాలకు MemLok More MemLok Plans

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Hope

నిరీక్షణ బైబిలులో నుండి నిరీక్షణను గురించి కొన్ని వాక్యాలు చూద్దాము. మీరు సమాధానము, నిర్భయము, సంపూర్ణ విశ్వాసము మరియు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు కదూ? మీరు విచారముతోనూ, వ్యాకులతతోనూ, కోపోద్రేకులై ఉండాలని ఆయన ఎప్పుడూ కాంక్షించడు. నిరీక్షణను గురించిన వాక్యాలు మీకు మరింత క్షమాగుణము కలిగియుండుట నేర్పుతాయి. దేవుని వాక్యమును ధ్యానము చేయుటవలన జ్ఞానము లభిస్తుంది.

More

Bible Memory System ఐనటువొంటి MemLok వారు ఈ ప్రణాళికకు రూపకల్పన అందించినందు వలన వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.MemLok.com దర్శించండి.