మూల్యంనమూనా
అంతిమ మూల్యం
దేవుడు మనకొరకు తన ప్రాణాన్నర్పించిన అత్యాశ్చర్యమైన త్యాగం గురించి మనం ఆలోచనచేద్దాం.
దీనియొక్క మూల్యం అపారమైనది, ఇది మన హృదయపూర్వక సమర్పణను కోరుకుంటుంది.
మనం సంపూర్ణంగా లోపల ఉండడం, లేదా లోపల అసలు ఉండకపోవడం:
మన విశ్వాసప్రయాణంలో మనకు ఎంపిక ఉంది. అది మనం సంపూర్ణంగా లోపల ఉండడం, లేదా లోపల
అసలు ఉండకపోవడం. మనలను మనం దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొనడానికి, సంపూర్ణంగా వాడ
బడడానికి పిల్వబడ్డాం. మనఃపూర్వక సమర్పణ లేకపోవడం అవసరమైన నిజమైన సమర్పణను
కోల్పోయేలా చేస్తుంది.
దేవునితో ప్రగాఢమైనది మరియు అత్యంతసన్నిహితమైనది అయిన సంబంధం కలిగి ఉండడానికి మనం
సంపూర్ణ సమర్పణకొరకు ప్రేరణపొంది ఉన్నాం.
దేవునికి సంబంధించనివాటినన్నిటిని విడిచిపెట్టడం. మన జీవితాలలో ఆయన సన్నిధియొక్క
సంపూర్ణతను అనుభవించడంలో ఈ సమర్పణ చర్య అత్యంత ప్రధానమైనదని దీని అర్థం.
ఇందులో మూల్యంగురించి వివరించే శక్తిమంతమైన ఉపమానం మత్తయి 13:44 వచనంలో ఉంది.
పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉంది. ఒక మనిషి ఆ ధనాన్ని కనుగొని, మిక్కిలి
సంతోషించి, ఆ పొలం కొనడానికి తనకున్నవాటినన్నిటిని అమ్మివేశాడు. ఆ మనిషి ఆ ధనాన్ని
సంపాదించుకొనడం కొరకు సమస్తాన్ని మనఃపూర్వకంగా త్యజించాడు.
మన విశ్వాసంకొరకు మన సమస్తాన్ని విడిచిపెట్టడంయొక్క ప్రాముఖ్యతను ఈ ఉపమానం నొక్కి
చెబ్తుంది. ఈ ఉపమానంలోని మనిషి తనకున్నవాటినన్నిటిని అమ్మివేసినట్టుగా మనలను మనం
దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొనడానికి పిల్వబడ్డాం.
ఇది అత్యధికమైన మూల్యం అని అనిపించవచ్చు, అయితే బదులుగా మనం పొందే సంతోషం మరియు
సాఫల్యత కొలవలేనంతగా అపారమైనది.
మనం గుర్తుంచుకొనవలసినదేమిటంటే, మూల్యం అని మనం లెక్కిస్తున్నదంతా, నష్టం అని మనం అను
కుంటున్నదంతా – పూర్తిగా అంతా – మన జీవితాలలో యేసును కలిగి ఉండడంలో పొందే అనంతమైన
లబ్ది లేదా ప్రయోజనంయెదుట ఎంత మాత్రం పోల్చదగినది కాదు.
ఈరోజు మనం దేవుడు మనకొరకు చెల్లించిన అంతిమ మూల్యం గురించి ధ్యానంచేద్దాం, ఈ ధ్యానం మన
సంపూర్ణ సమర్పణకు ప్రేరణగా ఉండాలి గాక. మన జీవితాలలో ఆయన సంపూర్ణతను కలిగి
ఉండడంకొరకు
ఇది అత్యధిక మూల్యం అని అనిపించవచ్చు, అయితే యేసును కలిగి ఉండడంలో పొందే అనంతమైన లబ్ది
లేదా ప్రయోజనం మనం త్యాగం అనుకుంటున్నవాటినన్నిటిని మించినది.
మనం ఎప్పటికీ పొందగలిగిన గొప్ప ధననిది యేసు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఇండియాలో ఇంతవరకు సమీపించబడనివారిని సమీపించడంకొరకు కేంద్రీకరించబడిన బైబిల్ ప్రణాళికకు స్వాగతం. మనం ఇండియాలోని ప్రధానమైన అవసరతలను అర్థంచేసుకొనడంకొరకు వేదికను సిద్ధంచేసు కొని, తర్వాత వాటికి సంబంధించిన విషయాలను వాటి మూల్యంతోబాటు అన్వేషించి, చివరగా వాటి అంతిమ మూల్యం గురించి మనం మాట్లాడుకుందాం.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/