మూల్యంనమూనా

మూల్యం

3 యొక్క 2

మీరు చెల్లించవలసిన మూల్యం

వనరుల మళ్లింపు మరియు ప్రవేశమార్గం

బైబిల్‌ ప్రణాళికలోని రోజు-2 కి స్వాగతం. ఈ రోజు మనం మూల్యంతోబాటు వచ్చే మూడు అత్యంతముఖ్య

మైన విషయాలను పరిశోధించుదాం: వనరుల మళ్లింపు, మన పరిచర్యను మళ్లీ అంచనావేసుకొనడం,

మన జీవనశైలులను మళ్లీ క్రొత్తగా రూపొందించుకొనడం.

సందర్భానుసారమైన వచనాలతో మరియు పర్యాలోచనలతో ఈ మూడు ప్రయత్నాలను లోతుగా తెలుసు

కుందాం.

ప్రయత్నం 1: వనరుల మళ్లింపు

అపొస్తలుల కార్యములు 1:8 – “అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు

గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వర

కును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”

క్రైస్తవ ప్రవేశమార్గం (అవుట్‌ రీచ్‌) మరియు సౌవార్తీకరణకొరకు ప్రస్తుతం వనరుల కేటాయింపు గురించి

ఆలోచన చేద్దాం. ఈ ప్రయత్నాలలో అధికశాతంయొక్క లక్ష్యం (91%) ప్రధానంగా క్రైస్తవులమీదనే గాని,

క్రైస్తవేతరులమీద కాదని గణాంకాలు సూచించడం బాధకరమైన విషయం. ఇంకా సువార్తను విననివారిని

సమర్థవంతంగా చేరుకొనడంకొరకు వనరులను మళ్లించడంవలన కలిగే ప్రభావాన్ని పరిశీలించండి.

ఇంకా మిషనరీల పంపిణీ గురించి లోతుగా ఆలోచించండి, వీరిలో అధిక భాగం (76%) సువార్త

సమీపించిన ప్రాంతాలలోనే సేవచేస్తున్నారు, కేవలం స్వల్పశాతం (1%) మాత్రమే సువార్తను అసలు

విననివారిమీద కేంద్రీకరించబడింది.

ప్రయత్నం 2: మన పరిచర్యను మళ్లీ అంచనా వేసుకొనడం

ఫలించని అంజూరపు వృక్షాన్ని యేసు శపించడంగురించి తెలియజేసే మార్కు 11:12-14 వచనాలు

చదవండి. మన పరిచర్యలోని అలవాట్లను లేదా ఆచరణలను అంచనావేసుకొనడంయొక్క ప్రాముఖ్యత గురించి

ఆలోచించండి.

మన లక్ష్యం “సువార్త లేమి”ని నిర్మూలించడం కావాలి, శుభవార్తయొక్క సమర్థవంతమైన వ్యాప్తి మరియు

మన ప్రయత్నాలు ఏకపంక్తిమీద ఉండేలా ఖాయపర్చుకొనాలి. మనం దేవునిరాజ్యంలో ఫలించేలా మన

వ్యూహాలను విధానప్రక్రియలను ప్రవేశమార్గాలను మళ్లీ అంచనావేసుకొనడంలో జ్ఞానంకొరకు ప్రార్థించండి.

ప్రయత్నం 3: మన జీవనశైలులను మళ్లీ క్రొత్తగా రూపొందించుకొనడం

మన అవసరతలగురించి దిగులుపడకూడదని యేసు బోధించడాన్ని తెలియజేసే మత్తయి 6:25 వచనం

చదవండి.

2 కొరింథీ 11:27 వచనంలో వివరించబడిన అపొస్తలుడైన పౌలుయొక్క జీవనశైలి గురించి ఆలోచించండి.

పౌలు తనను తాను పరిచర్యకు హృదయపూర్వకంగా అంకితంచేసుకున్నాడు, నిద్రను భోజనాన్ని

సౌఖ్యాన్ని క్షేమాన్ని చాలా తరచుగా త్యాగంచేశాడు. తన స్వంత సుఖసౌఖ్యాలను త్యజించి చిరకాల

ప్రభావం చూపించే సువార్తను బోధించడంగురించి ఉదాహరించిన సి.టి.స్టడ్ కథనాన్ని పరిశీలించండి.

మీ స్వంత జీవనశైలిని అంచనావేసుకొనండి, అది సువార్తను వ్యాప్తిచేసే పరిచర్యతో సమరేఖమీద ఎలా

ఉండగలదో చూడండి. దేవుని రాజ్యంయొక్క పురోగతికి ప్రాధాన్యతకొరకు దేవునిమీద విశ్వాసంతో త్యాగ

నిరతి గల మనోవైఖరిని అవలంబించడానికి సిద్ధబాటు కొరకు ప్రార్థించండి.

ముగింపు:

వనరుల మళ్లింపు, మన పరిచర్యను మళ్లీ అంచనావేసుకొనడం మరియు మన జీవనశైలులను మళ్లీ

క్రొత్తగా రూపొందించుకొనడం మొదలైనవాటిలో ప్రయత్నాలను ఈరోజు మనం పరిశోధించాం. వీటిని మీ

జీవితానికి అన్వయించుకొనడంకొరకు దేవుని నడిపింపును కోరుకుంటూ ప్రార్థించడంలోను మరియు ఈ

ప్రయత్నా లను మననంచేయడంలోను సమయం గడపండి. ఇండియాలోను, బయటి దేశాలలోను

సమీపించబడని వారి జీవితాలలో మార్పు తీసుకొనిరావడంలో దేవుడు మనకు శక్తినిస్తాడు గాక.

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

మూల్యం

ఇండియాలో ఇంతవరకు సమీపించబడనివారిని సమీపించడంకొరకు కేంద్రీకరించబడిన బైబిల్‌ ప్రణాళికకు స్వాగతం. మనం ఇండియాలోని ప్రధానమైన అవసరతలను అర్థంచేసుకొనడంకొరకు వేదికను సిద్ధంచేసు కొని, తర్వాత వాటికి సంబంధించిన విషయాలను వాటి మూల్యంతోబాటు అన్వేషించి, చివరగా వాటి అంతిమ మూల్యం గురించి మనం మాట్లాడుకుందాం.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/