మూల్యంనమూనా

మూల్యం

3 యొక్క 1

ఇండియాలోని అవసరతలను అర్థంచేసుకొనడం

బైబిల్‌ ప్రణాళికలోని రోజు-1 కి స్వాగతం. మూల్యాన్ని లెక్కించడంగురించి మాట్లాడుకొనడానికి మునుపు,

మనం ఇండియాలోని ప్రధాన అవసరతలగురించి మాట్లాడుకొనడంమీద మన దృష్టినుంచుదాం.

ఈ అవసరతలను నొక్కిచెప్పే గణాంకాలను లోతుగా త్రవ్వి, మార్పుకొరకు ఉన్న అత్యావశ్యకతను

పర్యాలోచన చేద్దాం.

ప్రధాన గణాంకాలు:

1. ఇండియాలోని 90% గ్రామాలలో క్రైస్తవసంఘాలు లేవు: గ్రామీణప్రాంతాలలో క్రైస్తవ ఉనికి లేకపోవడం

గురించి, సువార్తను వ్యాప్తిచేయడంలో దీని సూచితార్థాలను పరిశీలించండి.

2. ఇండియాలో 2,279 ప్రజాసముదాయాలు సువార్తను అసలు విననేలేదు: జాషువా ప్రాజెక్ట్‌ ప్రకారం,

ఇండియాలో పరిశీలించదగిన సంఖ్యలో సమీపించబడని మనుషులున్నారు, రక్షణసందేశాన్ని వినే అవ

కాశం వీరికి కలగలేదు. సమీపించబడనివారిలో సుమారుగా ప్రతి రోజూ 70000 మంది సువార్తను విన

కుండానే మరణించడం గుర్తించవలసిన గంభీరమైన విషయం.

3. పరిమితమైన బైబిల్‌ అనువాదం: 1600 మాతృభాషలు మరియు 700 మాండలికాలతో భాషావైవిధ్యం

ఉన్న ఇండియాలో కేవలం 52 భాషలు మాత్రమే సంపూర్ణమైన బైబిల్‌ అనువాదాన్ని కలిగి ఉన్నాయి.

ప్రజ లకు వారి స్వంత భాషలలో సమర్థవంతంగా లేఖనాలను పంచుకొనడంలో ఇది విసరే సవాలును పరి

శీలించండి.

4. ప్రపంచంలోని సమీపించబడని ప్రజలలో మూడవ వంతు ఇండియాలోనే ఉన్నారు: ఇండియాలో విస్తార

సంఖ్యలో సమీపించబడనివారు ఉండడంగురించి, వారిని సువార్తతో సమీపించడంలో ఉన్న ప్రాముఖ్యత

గురించి ఉద్దేశపూర్వంగా ఆలోచించండి.

5. యేసు రెండవరాకడ – మత్తయి 24:14 : క్రీస్తు రాకడకు ముందుగా ఉండవలసినదైన ప్రపంచవ్యాప్త

సువార్త ప్రకటన గురించి నొక్కిచెప్పే మత్తయి 24:14 వచనాన్ని ధ్యానించండి. ఈ ప్రవచనం

నెరవేరడంలోను, సమీపించబడనివారిని చేరుకొనడంయొక్క అత్యావశక్యతలోను మన బాధ్యత గురించి

ఆలోచించండి.

మార్పు మరియు మూల్యం:

ప్రపంచప్రజలను సమీపించడం మూల్యంతో కూడుకున్నది, ఇందుకు మనం అంగీకరించవలసిన మూల్యం

మార్పు.

ఈ అవసరతలను సమర్థవంతంగా తీర్చడంకొరకు మార్పు అగత్యం.

ఇందుకు కావలసినవి ప్రాధాన్యతల బదలాయింపు, వనరులు, మరియు స్వకీయ సమర్పణ.

యేసును వెంబడించేవారిగా మనం మార్పుకారకులుగా ఉండడంకొరకు మరియు ప్రధాన కర్తవ్యాన్ని నెర

వేర్చడంకొరకు మనం పిల్వబడ్డాం.

వనరుల మళ్లింపు, పరిచర్య ప్రవేశమార్గాలను మళ్లీ అంచనావేసుకొనడం, మన జీవనశైలులను మళ్లీ

క్రొత్తగా రూపొందించుకొనడం, మరియు సువార్తను పంచుకొనడంలో మనలను మనం త్యాగనిరతితో

పునరంకితం చేసుకొనడం మొదలైనవి ఇందులో ఉంటాయి.

ఇండియాలో సమీపించబడనివారిని సమీపించే విషయంలో మార్పును సులభతరంచేయడంలో మన

బాధ్యతగురించి ధ్యానించుదాం.

ఈ అవసరతలను అర్థంచేసుకొనడంకొరకు మరియు తగిన చర్య తీసుకొనడంలో నడిపింపు కొరకు

సహాయంచేయవలసినదిగా క్లుప్తసమయం తీసుకొని ప్రార్థించి దేవుడిని వేడుకుందాం.

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

మూల్యం

ఇండియాలో ఇంతవరకు సమీపించబడనివారిని సమీపించడంకొరకు కేంద్రీకరించబడిన బైబిల్‌ ప్రణాళికకు స్వాగతం. మనం ఇండియాలోని ప్రధానమైన అవసరతలను అర్థంచేసుకొనడంకొరకు వేదికను సిద్ధంచేసు కొని, తర్వాత వాటికి సంబంధించిన విషయాలను వాటి మూల్యంతోబాటు అన్వేషించి, చివరగా వాటి అంతిమ మూల్యం గురించి మనం మాట్లాడుకుందాం.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/