మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!నమూనా
“మనందరికీ రక్షకుడు అవసరం”
దేవుడు ఆదాము మరియు హవ్వలను సృష్టించినప్పుడు, ఆయన వారిని పాపము లేనివారిగాను, ఆయనతో పరిపూర్ణ సహవాసంలో ఉండేలాగా సృష్టించాడు. ఆదికాండము మూడవ అధ్యాయంలో వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినప్పుడు, వారు పాపమును వారి జీవితాల్లోనికి, మరియు మానవ జాతి అంతటిలోనికి పాపమును తీసుకువచ్చారు. ఆదాము మరియు హవ్వల పాపము యొక్క ప్రభావం ఎంత గొప్పదో రోమా 3:23 వివరిస్తుంది.
“ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” రోమా 3:23
పాపము మరియు దాని ప్రభావమునకు అతీతులు ఎవరూ లేరు; మనలో ప్రతి ఒక్కరు దోషులే. దాని ఫలితంగా, మనమంతా దేవునికి దూరమయ్యాము. మన పాపం నిత్య ప్రతిఫలాన్ని తెస్తుంది.
“ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” రోమా 6:23
ఆదాము మరియు హవ్వలు దేవునికి విధేయులు కావటానికి తీసుకున్న నిర్ణయము వలన, వారికి మరియు వారి సంతతి అంతటికీ (మానవ జాతికి) మరణం తప్పించుకోలేనిదిగా మారిపోయింది; ఆత్మీయంగా మరియు భౌతికంగా. వారి వైఫల్యం తరువాత, దేవుడు ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది: పాపం మానవ జాతిలో తన పనిని కొనసాగింపనిచ్చి మానవ జాతి అంతరించిపోనివ్వటం, లేదా మానవాళి పాప బంధకాల నుండి విడిపింపబడటానికి ఒక మార్గమును ఏర్పరచడం. దేవునికి స్తోత్రం, ఆయన అత్యున్నత ప్రేమ మరియు కృపకు చిహ్నంగా, దేవుడు తన కుమారుని ద్వారా రక్షణకు మార్గమును ఏర్పరచాడు.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” యోహాను 3:16
“ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” రోమా 6:23
యేసు క్రీస్తుకు వేరుగా, మానవాళి భౌతిక మరియు ఆత్మీయ మరణానికి బద్ధులైవుంటారు; దీనికి అతీతులు ఎవ్వరూ ఉండరు. కానీ క్రీస్తులో ఉన్న మనకు, భౌతిక మరణం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, కానీ ఆత్మీయ మరణం (నరకం) ఇక ఉండదు. దానికి బదులుగా, మనం ఈ భూమిని విడిచిన తరువాత నిత్య జీవం మనకొరకు దాచివుంచబడింది. యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ బలియాగం మరియు ఆయన పునరుత్థానం ద్వారా, మనం పాపము యొక్క ఆత్మీయ శిక్షను తప్పించుకుంటాము!
ఈ ప్రణాళిక గురించి
మన జీవితంలో తీసుకునే అత్యధికమైన నిర్ణయాలు ఏదో ఒక విషయంలో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఒక్కటే ఉంటుంది. దేవుని ఉచిత వరమైన రక్షణ అనే ఈ అత్యద్భుతమైన నిర్ణయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనటానికి అవసరమైన ఒక సులభమైన మార్గదర్శి కోసం మీరు వెదుకుతుంటే, ఇక్కడ మొదలుపెట్టండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te