మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!నమూనా

మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!

6 యొక్క 2

“దేవుడు నిత్యత్వమును తన మనసులో కలిగి నిన్ను సృష్టించాడు”

దేవుడు మనలను సృష్టించినప్పుడు, మనం దాదాపు 70 లేదా 80 సంవత్సరాలు జీవించి ఉండాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు ఈ భూసంబంధమైన మరియు పరలోక సంబంధమైన (లేదా నిత్యత్వ) విగా ఉంటాయి. యాకోబు 4:14 మన ఉనికిలోని ఈ మూడు విషయాలను వివరిస్తుంది. అదేంటంటే,

“రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.” యాకోబు 4:14

“జీవితం కొద్దికాలమే ఉంటుంది” అనే మాట మీరు విని ఉంటారు. నిత్యత్వపు వెలుగులో అది నిజమే! బైబిల్ ఇలా చెబుతుంది,

“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.” హెబ్రీయులకు 9:27

మనమంతా భౌతిక మరణానికి లోనైనవారమే. కానీ భౌతిక మరణం అంటే మన శరీరము గతించిపోవడమే గాని ఆత్మ కాదు. మన ఆత్మ, లేదా మన శరీరంలో స్పృహా సహితమైన ఉనికి నిత్యం ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకం లేదా నరకం అనే స్థలాల్లో ఏదైనా ఒక దగ్గర నిత్యం ఉండబోతుంది.

దేవుడు నివసించే నిత్య పరదైసే పరలోకం.

దేవుని నుండి సంపూర్తిగా వేరైపోవడమే నరకం.

ఈ లోకంలో మనం సహజ జన్మను పొందుకోవటం అనేది కేవలం ఆశాశ్వతమైన, భూమిపై ఉండే భౌతిక జీవితం ప్రారంభం కావడం మాత్రమే కాదు గాని ఇక్కడ మరియు తదనంతరం నిత్యత్వములో కూడా మనం కలిగి ఉండే ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తుంది. కనుక నిత్యత్వపు వెలుగులో కొందరు ఈ లోక జీవితాన్ని లెక్కింపదగినదిగా చూడరు కాని అది వాస్తవం కాదు. మీ నిత్యత్వపు గమ్యం బ్రతికి ఉండగా మీరు చేసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది; అన్నింటికంటే ప్రాముఖ్యంగా, యేసు క్రీస్తును మీ జీవితానికి ప్రభువుగా చేసుకునే నిర్ణయం. యేసు క్రీస్తు ద్వారా రక్షణ మన అందరికీ అందుబాటులో ఉంటుంది, ఆయన ద్వారా మాత్రమే పరలోకంలో దేవుని నుండి వేరుగా నిత్యత్వంలో గడిపే మన గమ్యాన్ని మార్చుకోగలం. యేసు ఈవిధంగా చెప్పాడు,

“యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” యోహాను 14:6

మరి కొన్ని కారణాల చేత మనం ఈలోక జీవనంలో మనం చేసుకునే నిర్ణయాలు ప్రముఖ్యమైనవిగా ఉన్నాయి. మనం ఈలోకంలో చేసుకునే నిర్ణయాలు యేసు క్రీస్తును ఇంకా తమ సొంత రక్షకునిగా ఎరుగని అనేకుల మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అనుదినం, మన చుట్టూ ఉన్నవారు క్రీస్తు కొరకు మాదిరిగా మనం ఉండటాన్ని గమనిస్తూ ఉంటారు. క్రైస్తవులముగా, ఆయనను ఎరుగని వారి యొద్దకు పరలోకమును తీసుకు రావడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ వాడుకుంటాడు. యేసు ఇలా చెప్పాడు:

“మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.” మత్తయి 5:14-16

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!

మన జీవితంలో తీసుకునే అత్యధికమైన నిర్ణయాలు ఏదో ఒక విషయంలో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఒక్కటే ఉంటుంది. దేవుని ఉచిత వరమైన రక్షణ అనే ఈ అత్యద్భుతమైన నిర్ణయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనటానికి అవసరమైన ఒక సులభమైన మార్గదర్శి కోసం మీరు వెదుకుతుంటే, ఇక్కడ మొదలుపెట్టండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te