మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!నమూనా
“రక్షణ: దేవుని పని మరియు మీ పని”
మీ రక్షణ రెండు ముఖ్యమైన నిర్ణయాలను ఐక్యము చేస్తుంది. మొదటి నిర్ణయం మనకు ఏకైక రక్షకునిగా ఉండుటకు దేవుడు తన కుమారుని పంపడానికి ఆదిలో తీసుకున్నది. రెండవది, ఆయన కుమారుని మీ సొంత రక్షకునిగా అంగీకరించుటకు మీరు తీసుకునే నిర్ణయం.
“మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” ఎఫెసీయులకు 2:8-9
కృప అంటే అర్హత లేకున్నా, ఏమీ చేయకున్నా పొందే ఉపకారం అని అర్థం. రక్షణలో దేవుని భాగం కృప, మరియు యేసు క్రీస్తు అనే పరిపూర్ణ వరము ద్వారా ఆయన తన కృపను మనకు అందించుచున్నాడు. సిలువలో, మన పాపముల కొరకు యేసు పూర్తి వెల చెల్లించాడు. మరియు దేవుని కృపా మూర్తియైన యేసు ద్వారా మనము ఏ మంచి లేకుండా, మనము చెల్లించగలిగిన దానికంటే ఉన్నతమైన కృపను మనం పొందుచున్నాము. మనం మన రక్షణను కొనుగోలు చేసుకోలేము; అది మన తరపు నుండి ఎటువంటి మూల్యమును ఆశించకుండా అందరికీ అందుబాటులో ఉన్న ఉచిత వరము.
విశ్వాసం అంటే, దేనినైనా మనం భౌతికంగా చూడలేకపోయినా లేదా తాకలేకపోయినా అది ఉంది అనుటకు రుజువు అని నిర్వచించవచ్చు. రక్షణలో మన భాగంగా విశ్వాసం అవసరం, మరియు విశ్వాసం ద్వారా, మన చిత్తములో జరిగించే ఒక కార్యముగా, యేసును మన జీవితాలకు ప్రభువుగా చేసుకొనుట ద్వారా మనం దేవునికి మన జీవితాలను లోబరచుకుంటున్నాము. యేసు క్రీస్తు ద్వారా విశ్వాసము వలన దేవుని కృపను పొందుట వలన, ఎటువంటి సందేహం లేకుండా మీరు, ఎటువంటి ప్రశ్నలు లేకుండా దేవునితో కూడా పరలోకంలో నిత్యత్వములో ఉండుటకు నిర్ణయించబడ్డారు. మీరు ఈ వాస్తవం విషయంలో నూరు శాతం నిశ్చయత కలిగియుం
వచ్చు!
“మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.” ఎఫెసీయులకు 2:10
మనలో ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి వున్నాడు. వాటి వివరాలు ఎక్కువగా మీకు, దేవునికి మధ్యన ఉంటాయి. అయితే, దేవుడు తన పిల్లలందరి పట్ల ఒక ఉమ్మడి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అది మనం మంచి క్రియలు చేయుట ద్వారా మన విశ్వాసాన్ని పనిలో పెట్టుట. మనం అలా చేసినప్పుడు దేవుడు మన జీవితాల పట్ల కలిగిన ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని నెరవేరుస్తాము మరియు ఆయన ప్రేమను ఇతరుల యెడల ప్రకాశింపజేసే భాగ్యం మనకు లభిస్తుంది. రక్షణ అనేది ఒక ప్రారంభం మరియు ఒకదాని అంతం మరియు అది ఉత్సహించడానికి ఒక కారణం. మీరు ఎన్నటికీ మార్పు చెందిన ఒక నూతన సృష్టి!
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన జీవితంలో తీసుకునే అత్యధికమైన నిర్ణయాలు ఏదో ఒక విషయంలో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఒక్కటే ఉంటుంది. దేవుని ఉచిత వరమైన రక్షణ అనే ఈ అత్యద్భుతమైన నిర్ణయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనటానికి అవసరమైన ఒక సులభమైన మార్గదర్శి కోసం మీరు వెదుకుతుంటే, ఇక్కడ మొదలుపెట్టండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te