ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

7 యొక్క 5

“ప్రభావవంతమైన సాక్షిగా ఉండండి”

మన అనుదిన ప్రపంచంలో ప్రభావవంతమైన క్రైస్తవునిగా ఉండటం అనేది మన జీవితాల్లో ఇతరులు ఏమి గమనించాలని కోరుతున్నాడో అనేది అర్థం చేసుకోవడంతో ప్రారంభమౌతుంది. క్లుప్తంగా చెప్పాలంటే నిజానికి, అది యేసే. అయితే దాని అర్థం ఏమిటి?

మనం ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడో అనేదానికి యేసు పరిపూర్ణమైన మాదిరిని చూపించాడు. మనం ఇప్పుడు జీవిస్తున్న ప్రపంచ పరిస్థితులకు భిన్నమైన పరిస్థితుల్లో యేసు జీవించినప్పటికి, ఆయన దేవుని సంపూర్ణ లక్షణాలను చూపించి ఆధునిక ప్రపంచానికి తగిన ఉదాహరణ ఇచ్చాడు.

మన జీవితాల్లో మనం దేవుని లక్షణాలను పెంపొందించుకొని ఇతరులు దానిని చూడాలని ఆయన ఆశిస్తున్నాడు. యేసుతో మనకుండే వ్యక్తిగత సంబంధం ద్వారా మాత్రమే దానిని సాధించగలం. యేసు ఇలా చెప్పాడు:

“ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.” యోహాను 15:5

“మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.” యోహాను 15:8

ద్రాక్షతీగె అది అతుకబడి ఉన్న ద్రాక్షవల్లి నుండి తన జీవమును పొందుతూ ఏవిధంగా ఫలిస్తుందో, యేసులో నిలిచియుండే మనము కూడా అదేవిధంగా ఫలిస్తాము లేదా మన జీవితాల ద్వారా ఇతరులకు దేవుని స్వభావమును కనుపరుస్తాము.

“అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు.” గలతీయులకు 5:22-24

దేవుని స్వభావమైన ఆయన ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహము మనలో మరియు మన ద్వారా పనిచేస్తున్నప్పుడు మనం జీవించే విధానం ప్రభావవంతమైన సాక్ష్యముగా ఉంటుంది.

యేసు దినములలో ఉన్నట్లుగానే, దేవుని లక్షణాలను మన జీవితాల ద్వారా బహిరంగముగా, క్రియారూపకంగా ప్రదర్శించినప్పుడు ఆత్మ ఫలం ఇతరులకు కనిపించకుండా పోదు. అది క్రైస్తవులు మరియు అవిశ్వాసుల దృష్టిని ఆకర్షిస్తుంది, మరియు ఎవరో ఒకరు దాని గురించి అడుగకుండా ఉండరు.

“నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.” 1 పేతురు 3:15-16

సిద్ధంగా ఉండండి. ఎవరో ఒకరు గమనిస్తూ మీరు అస్సలు ఊహించని సమయంలో మిమ్మును అడుగుతారు. రక్షణ గూర్చిన మీ సాక్ష్యం మరియు ఈ జీవితంలో దేవుడు కొనసాగిస్తున్న కార్యము దీనికి గొప్ప ప్రారంభముగా ఉంటుంది. మరియు, దేవుని ప్రేమ మరియు రక్షణ అందరికీ అందుబాటులో ఉంటుందనే అద్భుతమైన వార్తను అందరూ అర్థం చేసుకొనటానికి వారికి సహాయపడేందుకు ఈ పుస్తకమును మరొక పరికరముగా మీరు వాడుకోవచ్చు.

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!

ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te