ఉద్దేశముతో కూడిన జీవితం జీవించండి!నమూనా
“ఇతరులకు మన ప్రేమను అందించుట”
మన జీవితాల్లో ఉత్తేజకరమైన మరియు ఎదుగుచున్న ప్రేమ పని చేస్తుండగా, ఇతరులను ప్రేమించే సామర్థ్యత స్వాభావికంగా మనలో అభివృద్ధి చెందుతుంది. ఇతరుల పట్ల పరిపక్వమైన ప్రేమను బట్టి ఆ ప్రేమను చూపించాలనే పెంపొందుచున్న ఆశ వలన దేవుడు మనలను సృష్టించిన ఉద్దేశాలలో అత్యంత ప్రాముఖ్యమైంది నెరవేరుతుంది:
“మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.” ఎఫెసీయులకు 2:10
మనం ప్రేమతో పాటు క్రియను కూడా కలిగి ఉండాలనేది మొదటి నుండి దేవుని ప్రణాళిక. మంచి కార్యముల ద్వారా ఇతరుల జీవితాలను తాకాలనేది దేవుని ప్రణాళిక.
ఒక దయ గల మాట, ఒక అవసరతకు స్పందించుట, లేదా బాధపడుతున్న వారు చెప్పేది వినటం ద్వారా ఇతరుల జీవితాలను మనం తాకిన ప్రతిసారీ, మనం మన ప్రేమను కనుపరచడం మాత్రమే కాదు, కానీ వారి పట్ల ఉన్న దేవుని ప్రేమను వారికి తెలియపరుస్తాము. ఈవిధంగా, అంధకారంతోను, నిరీక్షణ లేమితోను ఉన్న ఈ లోకంలో దేవుని మహిమను ప్రకాశింపచేసే ప్రతినిధులముగా మనం ఉంటాము. యేసు చెప్పిన మాటలు చూడండి:
“మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.” మత్తయి 5;14-16
మన వెలుగును ప్రకాశింపనివ్వడం అంటే నిజంగా మన ద్వారా దేవుని వెలుగును ప్రకాశింపనివ్వడమే. ఇతరులపై దేవుని వెలుగును ప్రకాశింపనివ్వడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ప్రభావవంతమైన సాక్షిగా ఉండటం; ఇతరులకు పరిచర్య చేయడం; మరియు క్రైస్తవులతో సహవాసం చేయడం. ఈ మూడు మార్గాలలో మన విశ్వాసాన్ని క్రియాలలోనికి మలచడం ఇతరులు దేవుని మహిమర్థమై ఆయన ప్రేమను, కృపను మరియు కరుణను అనుభవించడానికి సహాయపడుతుంది.
ఈ ప్రణాళిక గురించి
ఆనందకరమైన, ఉద్దేశముతో కూడిన జీవితం సంబంధాలు, ప్రేమ మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే, మీ ప్రయత్నం మరియు పరిశోధనపై దృష్టి కలిగి ఉండటానికి సహాయపడేందుకు ఈ ప్రణాళికలో పాల్గొనండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te