మీ అత్యుత్తమ పెట్టుబడి!నమూనా
“మీ జ్ఞానాన్ని పెంపొందించుకోండి”
దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే జీవితమంతా కష్టపడాలి. అది ఒక్కరాత్రిలో జరిగేది కాదు. కానీ మరింత సమగ్రంగా దానిని అర్థం చేసుకొనటానికి సహాయపడే కొన్ని విధానాలు ఉన్నాయి. కొన్ని ఆలోచనలు క్రింద ఇవ్వబడ్డాయి:
1 – కొన్ని పరికరాలు సంపాదించుకోండి. మీరు చదువుతున్నది మెరుగుగా అర్థం చేసుకొనటానికి సహాయపడే కొన్ని ధ్యాన సహాయకలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, స్టడీ బైబిళ్ళు, నిఘంటువులు, మరియు అంశ ధ్యాన మార్గదర్శకాలవంటివి ఆన్లైన్లోను, పుస్తక రూపంలోనూ దొరుకుతాయి.
2 – ఇతర క్రైస్తవులతో సంభాషించటానికి మరియు యితరులు దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో ఏవిధంగా అన్వయించుకుంటున్నారో గమనించటానికి బైబిల్ ధ్యాన బృందాల్లో లేదా చిన్న గుంపులలో పాల్గొనండి.
3 – ఒక ప్రణాళిక కలిగి ఉండండి. మీ వ్యక్తిగత ధ్యాన సమయం విషయంలో ఆసక్తిగా ఉన్నవారు బైబిల్ అంతటినీ చదవటానికి మిమ్మల్ని నిర్దేశించి సహాయపడటానికి తగిన ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు మీరు బైబిల్ అంతటినీ ఒక సంవత్సరంలో చదవటానికి సహాయపడతాయి – తక్కువలో తక్కువ చెప్పాలంటే అది చెప్పుకోదగ్గ ఒక విజయమే!
ఆయన వాక్యంలో మీరు ఎంతగా సమయం గడిపితే, దానిని మీరు మరింత చక్కగా అర్థంచేసుకోగలరు. మీరలా చేస్తుండగా, మీరు ప్రస్తుతం ఉన్న కాలములో మీరు ఏమి చేయాలో అర్థం చేసుకొనటానికి దేవుడు సహాయపాడతాడని కూడా మీరు తెలుసుకుంటారు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఆశీర్వాదకరమైన మరియు సమృద్ధియైన రాబడి పొందాలంటే సరైన విధానంలో పెట్టుబడి పెట్టాలి. మీరు నూతన క్రైస్తవులైతే, దేవుని వాక్యం అనుదినం ధ్యానించడానికి మించిన గొప్ప పెట్టుబడి మరేది ఉండదు. మీరు చదువుకొనటానికి, దానిని అర్థం చేసుకొని ప్రభావవంతంగా పాటించటానికి మీకు సహాయం చేయునట్లు ఇక్కడ ప్రారంభించండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te