మీ అత్యుత్తమ పెట్టుబడి!నమూనా
“బైబిల్ యొక్క సంక్షిప్త వివరణ”
బైబిల్ నిండా కాలాతీతమైన సూత్రాలు, స్పష్టమైన ఉపదేశము మరియు సమతుల్యమైన, సంతృప్తికరమైన మరియు ఆశీర్వాదకరమైన క్రైస్తవ జీవితానికి తగిన సందర్భోచితమైన ఉదాహరణలు ఉన్నాయి. వాస్తవానికి, కాలం లేదా పరిస్థితులు మారుతున్నప్పటికి, దేవుని వాక్యం ఎన్నటికీ అసందర్భమైంది కాదు, కాబోదు. మరియు అది మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశాలను నెరవేర్చటానికి మనల్ని సిద్ధపర్చి మనకు తర్ఫీదునివ్వటానికి మనకు అందుబాటులో ఉంది.
“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” 2 తిమోతికి 3:16-17
బైబిలును సన్నిహితముగా రాయబడిన దేవుని భావప్రకటన మరియు ఆయన మానవాళికి చెప్పాలని ఆశించిన సమాచారముగా అనుకోవచ్చు. దీని అర్థం ఏమిటో తెలుసుకోవటానికి అవసరమైన కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి:
1 – బైబిల్ దైవ ప్రేమ యొక్క వాస్తవిక భావప్రకటన. అది ఆయన లక్షణాలు మరియు గుణములు, ఆయన సంభాషణలు మరియు ఆజ్ఞలు, మరియు ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ పరిపూర్ణముగా కనుపరచబడిన విధానము గురించి మాట్లాడుతుంది.
2 – బైబిల్ దేవుని చేత పలుకబడింది. బైబిలలోని 66 పుస్తకాలు భౌతికంగా అనేకమైన రచయితల చేత వ్రాయబడింది కాని వారు రాసిన ప్రతి విషయం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చేత నేరుగా ప్రేరేపించబడినవారై రాశారు.
3 – బైబిల్ మన జీవితాల్లో దేవుని అధికారమై వున్నది. చివరిగా, బైబిల్ మానవులకు దేవుడు రాసిన “ఉత్తరాలు” కనుక, మరియు అందులోని విషయాలు దేవుని చేత నేరుగా పలుకబడినవి కనుక, దేవుని వలెనే ఆయన వాక్యం కూడా అధికారాన్ని మన జీవితాల్లో కలిగి ఉంటుంది.
మన ఆత్మీయ ఎదుగుదల మరియు దేవునిలో మన పరిపక్వతకు దేవుని వాక్యము మనకు అత్యంత ప్రాముఖ్యమైన పునాది. దేవుని వాక్యము యొక్క విత్తనాలు మన జీవితాల్లో పూర్తిగా అభివృద్ధి చెందాటానికి అనుమతి ఇవ్వాలంటే, మనం దానిని చదువుట ద్వారా ఆ విత్తనాలను విత్తి, దానిని అవగాహన చేసుకొనుటలో వృద్ధి చెంది, దానిని మన జీవితాలకు అన్వయించుకోవాలి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఆశీర్వాదకరమైన మరియు సమృద్ధియైన రాబడి పొందాలంటే సరైన విధానంలో పెట్టుబడి పెట్టాలి. మీరు నూతన క్రైస్తవులైతే, దేవుని వాక్యం అనుదినం ధ్యానించడానికి మించిన గొప్ప పెట్టుబడి మరేది ఉండదు. మీరు చదువుకొనటానికి, దానిని అర్థం చేసుకొని ప్రభావవంతంగా పాటించటానికి మీకు సహాయం చేయునట్లు ఇక్కడ ప్రారంభించండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te