మీ అత్యుత్తమ పెట్టుబడి!నమూనా
“తప్పనిసరిగా వచ్చే రాబడి!”
నేటి ప్రపంచంలో, ఈ మాట కొంతమంది అనుమానించి, అంగీకరించలేని విధేయంగా ఉంటుంది. కాని దాదాపు జీవితంలో అన్ని విషయాలకు అన్వయించుకోగలిగే సార్వత్రిక నియమం ఒకటి ఉంది: విత్తే సమయం మరియు కోసే సమయం అనే నియమం, లేదా ఇంకా సరళంగా చెప్పాలంటే, “నీవు ఏది విత్తితే అదే కోసుకుంటావు.”
ముందుగా విత్తనాలు విత్తకుండా కోత కోయలేవు. మొదటిగా పెట్టుబడి పెట్టకుండా కోతకోయలేవు. మొదటిగా ఒక వస్తువు లేదా సేవలు కొనుగోలు చేస్తేనే దానిని పొందుకోగలం. సమతుల్యమైన ఆహారపు అలవాట్లు మరియు అనుదిన వ్యాయామం లేకుండా మంచి ఆరోగ్యాన్ని అనుభవించలేవు. మరియు ఈ ఉదాహరణలన్నీ చూస్తే, మనం పొందుకునే రాబడి మనం పెట్టిన పెట్టుబడికి సమాన నిష్పత్తిలో ఉంటుంది.
దేవునితో మనకున్న సంబంధం విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. దేవునితో సంతృప్తికరమైన మరియు ఆశీర్వాదకరమైన ప్రయాణం అనే విత్తనం విత్తకుండా అదే పంటను కోయలేము. శుభవార్త ఏమిటంటే, దేవుడు మంచి విత్తనాన్ని మన కోసం ముందుగానే సిద్ధపర్చాడు- ఇదే దేవుని వాక్యమైన బైబిలు. దేవుని వాక్యాన్ని ధారాళంగా మన జీవితాల్లో విత్తడం ఆ పెట్టుబడి మీద సమృద్ధియైన రాబడిని మనకు తెచ్చిపెడుతుంది.
ఈ ప్రణాళిక గురించి
ఆశీర్వాదకరమైన మరియు సమృద్ధియైన రాబడి పొందాలంటే సరైన విధానంలో పెట్టుబడి పెట్టాలి. మీరు నూతన క్రైస్తవులైతే, దేవుని వాక్యం అనుదినం ధ్యానించడానికి మించిన గొప్ప పెట్టుబడి మరేది ఉండదు. మీరు చదువుకొనటానికి, దానిని అర్థం చేసుకొని ప్రభావవంతంగా పాటించటానికి మీకు సహాయం చేయునట్లు ఇక్కడ ప్రారంభించండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te