మీకు ఒక ప్రార్థన ఉంది!నమూనా

మీకు ఒక ప్రార్థన ఉంది!

6 యొక్క 5

“ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ప్రార్థనకు ఆరు తాళపుచెవులు- మొదటి భాగం”

1. మీరు ఎవరితో మాటలాడుతున్నారో తెలుసుకోండి. “పరలోకమందున్న మన తండ్రి...”

తండ్రిని నేరుగా వేడుకొనమని యేసు తన శిష్యులకు బోధించినప్పుడు, బహుశా కొంతమంది అటువంటి ఆలోచనను హేళనగా చూసి ఉండవచ్చు. పాత నిబంధన అంతటా, ఒక సాధారణ వ్యక్తి దేవునికి తన విన్నపాలు తెలియజేయలంటే యాజకుని ద్వారా ఒక్కటే మార్గం. దేవుని దయవలన యేసు అదంతా మార్చటానికి వచ్చాడు.

మన పాపాన్ని కప్పడానికి సిలువలో యేసు చేసిన పరిపూర్ణమైన త్యాగం మూలంగా విశ్వాసులకు ఇప్పుడు తండ్రితో నేరుగా సంబంధం ఉంటుంది. అందుకే మనం “యేసు నామంలో” మన పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తాము. ఏదేమైనా, ప్రార్థనకు నియమింపబడిన సూత్రాలు ఏమీ లేవు మరియు తండ్రిని సంబోధించడం ఎంత అర్థవంతంగా ఉంటుందో యేసుకు ప్రార్థన చేసినా అలాగే అర్థవంతంగా ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం దేవునికి, నీకు మధ్య ఎటువంటి సమాచార అంతరాయం లేదు.

2. ఆయన మీ కొరకు చేసిన ప్రతి విషయం గురించి ఆలోచించి దేవుని పట్ల మీ ఆరాధనా భావాన్ని మరియు కృతజ్ఞతను చూపించండి “నీ నామం పరిశుద్ధవరచబడును గాక!”

మీ ప్రార్థనలో కొంత భాగాన్ని స్తుతి ఆరాధనకు కేటాయించటం ద్వారా మీ దృష్టిని మీ పైనుండి తీసివేసుకుంటారు. మన అవసరతలు మరియు ఆశల గురించి దేవుడు వినాలని ఆశిస్తుండగా ఆయన మన కోసం చేసిన కార్యముల గురించి కృతజ్ఞత కలిగి ఉండాలని, “అంతా మన గురించే కాదని” మనం గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. వాస్తవానికి, సమస్తం ఆయన కోసమే. ఆయన సమృద్ధి మరియు ప్రేమ కలిగిన దేవుడు మరియు స్తుతి, ఆరాధనకు ఆయన అర్హుడు. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాల గూర్చి మరియు ఆయనతో మీకున్న అద్భుతమైన సంబంధమైన భాగ్యం గూర్చి మీరు ఆలోచించినప్పుడు మీ కృతజ్ఞతను, ప్రేమను మరియు వందనము తెలియజేయటం మీకు సులభతరం అవుతుంది. మీపై మీ దృష్టి పెట్టుకొనటం కూడా కష్టమైపోతుంది.

3. దేవుని సంఘం పట్ల మరియు మీ పట్ల సంపూర్తిగా ఆయన చిత్తం జరగాలని మీరు ప్రార్థన చేయండి. “... నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక.”

గతంలో వచ్చిన సమస్యల నుండి మన మనసులను తొలగించుకొని భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైన విషయాల పై దృష్టిని పెట్టినప్పుడు శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన ప్రార్థన చేయగలుగుతాము. ఎల్లపుడూ మన గతం పై దృష్టిని కలిగి ఉండటం మన భవిష్యత్తును పరిమితము చేస్తుంది. దేవుని దృక్కోణంలో చూడండి, మీ గతములోని మీ సవాళ్ళు మరియు వైఫల్యములు మీ ఆలోచనలను స్వాధీనపరచుకొని, మీ ఉద్దేశాలను పరిమితం చేయకుండా జాగ్రత్తపడండి. క్రీస్తులో మీరు ఎంత దీవించబడగలరో చూచుటకు మీకున్న ఆశలను దేవుని ముందు పెట్టండి మరియు మీ కలలు మరియు దర్శనాన్ని విస్తరింపజేయటానికి సహాయం చేయమని దేవుని వేడుకోండి. దేవుని మరియు ఆయన సంఘ ఉద్దేశాలను మీరు పూర్తిగా నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు.

వాక్యము

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

మీకు ఒక ప్రార్థన ఉంది!

శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te