మీకు ఒక ప్రార్థన ఉంది!నమూనా
“దేవుడు మీ మాటలు వినాలని ఆశిస్తున్నాడు”
మనం సవాళ్ళు ఎదుర్కున్నప్పుడు ప్రార్థనను ఆఖరి ప్రయత్నంగా చూడటానికి ఉన్న అనేక కరణాల్లో ఒకటి, మనకు దేవుని గూర్చిన సరైన అవగాహన లేకపోవడమే. మనం కొన్నిసార్లు పొరపాటుగా, దేవుడు మన జీవితాల పట్ల దూరమైన మరియు వ్యక్తిగతము కాని స్థాయిలోనే ఆసక్తిని కలిగి ఉన్నాడని అనుకుంటాము. కానీ, దేవుడు నీ జీవితం పట్ల సన్నిహితమైన ఆసక్తిని కలిగి ఉన్నాడనేది వాస్తవం. ఆయన నిన్ను ఆయన సంతోషం కొరకు సృష్టించుకున్నాడు మరియు నీలో, నీ ద్వారా పనిచేయాలని ఆశిస్తున్నాడు!
ప్రార్థన అంటే సులభంగా చెప్పాలంటే, దేవునితో సంభాషణ. మీకున్న సన్నిహిత స్నేహితుని గూర్చి ఆలోచించండి. మీకు అవసరమైనప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి మీతో ఉంటాడు, కానీ మీరు వారితో అప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అవునా? మీ జీవితాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు కదా! అయితే, దేవుడు మీ అత్యంత సన్నిహితుడైన స్నేహితునిగా ఉండాలని ఆశిస్తున్నాడు. మీరు ఆయనకు ఏదైనా చెప్పవచ్చు, మీరు ఆయనతో కలిసి నవ్వవచ్చు, మీ దినము ఎలా గడిచిందో ఆయనకు చెప్పవచ్చు, మీరు ఆయనతో యాథార్థంగా ఉండవచ్చు మరియు మీ హృదయ వాంఛలు మీరు ఆయనతో చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన మీ సంగతులన్నీ వినాలని ఆశిస్తున్నాడు. మీరు ఆయనతో సన్నిహిత, వ్యక్తిగత సంభాషణ కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు.
“ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.” ప్రకటన 3:20
వ్యక్తిగత స్థాయిలో విలువైన సహవాసపు సమయాన్ని గడపాలని యేసు మన హృదయ తలుపును తట్టుచున్నాడు. సహవాసం కొరకు యేసు మెల్లగా తలుపును తట్టినప్పుడు దానిని తెరవడం దేవుని ఆశీర్వాదలతో నిండిన ప్రభావవంతమైన మరియు ఫలభరితమైన ప్రార్థనా జీవితానికి ప్రారంభం.
దేవుడే మన జీవితంలో భద్రతకు నిజమైన ఆధారం మరియు ఆయన తన నమ్మకత్వాన్ని మరియు పమను మనకు చూపించాలని ఆశిస్తున్నాడు- ఆయనకు ఏ సవాలు పెద్దదిగా కంపించదు – కేవలం ఆయన మీ మాటను వినాలని ఆశిస్తున్నాడు.
“జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.” కీర్తనలు 62:8
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te