మీకు ఒక ప్రార్థన ఉంది!నమూనా

మీకు ఒక ప్రార్థన ఉంది!

6 యొక్క 3

“వ్యక్తిగత ప్రార్థన”

స్నేహితులతో, కుటుంబంతో, కలిసి ప్రార్థన చేయడం లేదా భోజనం చేసేముందు ప్రార్థన చేసుకోవటం అందరి ముందు దేవునితో సంభాషించడానికి అద్భుతమైన విధానాలు. అందరితో కలిసి ప్రార్థన చేయటంతో పాటుగా, వ్యక్తిగత, మరింత ఆంతరంగిక ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది కేవలం మీకు మరియు దేవునికి మధ్యనే ఉండాలి. మన ప్రార్థనలు రహస్యంగా ఎలా ఉండాలో యేసు ఈవిధంగా చెప్పాడు:

“నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.” మత్తయి 6:6

మూయబడిన తలుపుల వెనుక మనం ప్రార్థన చేయాలని యేసు చెప్పడం దేవుడు మన జీవితాల పట్ల ఎంతో వ్యక్తిగతంగా మరియు సన్నిహితంగా శ్రద్ధ చూపుతున్నాడని తెలియజేస్తుంది. వ్యక్తిగత సంభాషణ ద్వారా మనకు ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించాలనేది ఆయన ఆశ. దేవునితో వ్యక్తిగత సంభాషణ చేయటానికి నీవు గమనించి నీకు ప్రతిఫలం ఇస్తానని, ఆశీర్వాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

మన ప్రియమైన వ్యక్తులతో ఉండే విధంగానే, దేవునితో మన సంభాషణలో యాదార్థంగా, దాపరికాలు లేకుండా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థనలను ప్రతి అక్షరంతో సహా గుర్తుపెట్టుకోవటం మంచి అలవాటే కాని వాస్తవం ఏమిటంటే, ఏదో బట్టీ పట్టిన పదాలు వల్లించడానికి బదులు మనం ఆయన వద్ద నిజమైన భావప్రకటన చేయాలని కోరుతున్నాడు. మన ప్రార్థనల్లో యధార్థత ఉండాలని ఈ మాటలు చెబుతున్నాడు:

“మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును;” మత్తయి 6:7-8

మనం అడుగక ముందే మనకు ఏది అవసరమో, ఏమి కోరుతున్నామో అన్నీ దేవునికి తెలిసినప్పటికీ మనం హృదయపూర్వకంగా మరియు ఆయన మనమంచి కోరేవాడనే విశ్వాసంతో ఆ అవసరతలను ఆయన ముందుంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ప్రార్థనకు ప్రేమతోనూ నమ్మకత్వంతోనూ జవాబు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు.

వ్యక్తిగత ప్రార్థనలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, విడువక మరియు ఎడతెగక ప్రార్థన చేయటం. మనం ఇంతకుముందు చేసిన ప్రార్థనలే అయినప్పటికీ మన విన్నపములను వినుటలో దేవుడు ఎప్పుడూ విసుగుచెందడు. మన ప్రార్థన శ్రద్ధతో చేయాలని యేసు ఈవిధంగా చెప్పాడు:

“అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.” మత్తయి 7:7-8

దేవునితో వ్యక్తిగత సంభాషణ కోసం అనుదిన సమయాన్ని కేటాయించటం క్రైస్తవ జీవితంలో ఎదగడానికి చాలా ప్రాముఖ్యమైన విషయము. మీ ఏకాగ్రత దెబ్బతినని ఒక సమయాన్ని ఎంచుకొనటానికి ప్రయత్నించండి మరియు మీరు దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చారో చూడటానికి దేవుడు స్టాప్ వాచీ పెట్టుకున్నాడని అనుకోవద్దు. ఆయన అలా చేయదు. కేవలం ఆయన మిమ్మును కోరుకుంటున్నాడు. రహస్యంగా, యాథార్థంగా, విసుగక ప్రార్థించటం అనేవి దేవునితో మీరు వ్యక్తిగత సమయం గడపటానికి అవసరమైన మూడు విషయాలు మరియు అవి మీరు దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవటానికి ఉపయోగపడతాయి. ఈ అమూల్యమైన సమయాన్ని ఆనందించటానికి మీరు వస్తారు మరియు మీరు ఇంతకు మునుపెన్నడూ చేయని విధంగా ఆయన మీద ఆధారపడటానికి ముందుకు వస్తారు.

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

మీకు ఒక ప్రార్థన ఉంది!

శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te