విమోచననమూనా
నిత్యత్వం విమోచించబడినవారి గమ్యం
మనం మన ఏడు-రోజుల ప్రయాణాన్ని ముగిస్తూ ఉండగా, నిత్యత్వం మీ గమ్యం అని మీరు గుర్తించడం ముఖ్యం. భూమిమీద మీ జీవితకాలంలో మానవజీవితంలోని సంఘర్షణలలోను దీవెనలలోను మీరు కొనసాగుతున్నారు. ఇప్పుడు మీ హృదయంలో నిత్యత్వం గురించి ఒక ఆలోచన రూపొందింది, మీ హృదయంలో నివసించే యేసుకు కృతజ్ఞతలు. మీరు కష్టంలో నడిచినా సుఖంలో నడిచినా, మీరు దేనిని సహించవలసివచ్చినా బాధగాని దుఃఖంగాని లేని నిత్యత్వం గురించి మీలో నిశ్చయత ఉండగలదు. మీ జీవితం విజయవంతంగా ఉన్నా లేకపోయినా మీరు ఊహించలేని గొప్ప ప్రతిఫలాన్ని నిత్యత్వం మీకు ఇస్తుంది. నిత్యత్వంలో యేసుతో జీవితం మీరు ఆనందకరమైన శుభనిరీక్షణ. నిత్యత్వం ఇప్పుడే ప్రారంభమవు తుంది, మీ జీవితంయొక్క స్వభావం దానిని నిర్ణయిస్తుంది. మీరు దైవికమైన దర్శనంలో జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధతలో ప్రత్యేకించబడి జీవిస్తున్నప్పుడు మీ జీవితం దానికదే యేసును పోలి ఉంటుంది. లోకంమీద మీరు గాఢమైన ప్రభావాన్ని చూపించగలరు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ ముద్రలు ఉండగలవు, మీ జీవితకాలం అనంతరం కూడ ఇవి నిలిచి ఉంటాయి. నిత్యత్వంపట్ల శక్తిమంతమైన మనోవైఖరి ఇదే.
మీ కలలు కోరికలు ముఖ్యమైనవే, వాటిని విడిచిపెట్టకుండానే దేవుడు మీ హృదయంలో ఉంచిన వాటిని అనుసరించడంలో కొనసాగండి. సర్వకాలాలకు తగిన బహుమానంమీద మీ దృష్టి ఉంచండి, ఆ బహు మానం స్వయంగా యేసే. విజయంపట్ల ధనంపట్ల లేదా పలుకుబడిపట్ల మీలో కోరికలున్నాయేమో, అది సరే, మీకు యేసుతో సంబంధం లేనట్లయితే అవన్నీ వ్యర్థం. నేడే ఆయనను ఎన్నుకోండి, అనుదినమూ ఆయనను ఎన్నుకోండి, ఆయన వాక్యంలో ఆయనను వెతకండి. మీ హృదయం మీ మనసు నూతనమయ్యేలా పరి శుద్ధాత్మతోబాటు అడుగులు వేయండి.
తలంపు:
జీవితంలో మీరు క్రుంగిపోయినప్పుడు పైకి చూడండి, మీరు నిత్యత్వంకొరకు తర్పీదు పొందుతారు మరియు సిద్ధంగా ఉంటారు.
ఈ ప్రణాళిక గురించి
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/