విమోచననమూనా
యేసు క్రీస్తు ఒక్కడే విమోచకుడు
గతంలోని సమస్య పాపం, ప్రస్తుతంలోని సమస్య పాపం, ఎప్పటికైనా సమస్య పాపమే. దేవునిలో ఈ సమస్య లేదు, ఆయన వాక్యంలో ఎన్నడూ లేదు. ఆయన తన ప్రజలకు చేసిన వాగ్దానంలోని ప్రతి మాట లోను నమ్మతగినవాడు. పాపం మనిషిని దేవునినుండి దూరం చేసింది. పాపానికి “ఒకే ఒక” పరిష్కారం మనుషులందరి పాపాల ప్రాయశ్చిత్తంకొరకు నిర్దోషమైన బల్యర్పణ. దేవుని కుమారుడైన యేసు క్రీస్తే ఆ బల్యర్పణ. ఆయన సంపూర్ణంగా దేవుడు. అయినప్పటికి ఆయన మనిషిగా యూదయలోని రాతినేలమీద నడిచాడు, మనుషులతో మాట్లాడాడు, పిల్లలను ప్రేమగా ఎత్తుకున్నాడు, వెలివేయబడినవారిని ముట్టు కున్నాడు, భూమి మీదకు పరలోకాన్ని తెచ్చాడు. ఆయనకు ముప్పయి సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆయన జీవితం సాధారణంగానే గడిచింది, తదుపరి మూడు సంవత్సరాలలో ఆయన జీవితం మలుపు తిరి గింది, ఆయన బోధించాడు, ప్రజలకు పరిచర్య చేశాడు. చేయని నేరాలు ఆయనమీద మోపబడ్డాయి, ఆయ నను బంధించారు, యెరూషలేము వీధులలో ఒక సామాన్య నేరస్థుడిని ఊరేగించినట్టుగా ఆయనను ఊరే గించారు, తర్వాత ఆయన ఒక కొండమీద సిలువపైన వ్రేలాడుతూ మరణించాడు. నలిగిపోయి రక్తం కారు తున్న ఆయన శరీరం మతపెద్దల ద్వేషాన్ని సైనికుల ఆగ్రహాన్ని భరించింది. ఆయన సిలువమీద వ్రేలాడుతూ లోకపాపాన్నంతా భరించాడు, పాపపరిహారార్థబలిగా ఆయన తనను తాను తన తండ్రికి అప్పగించు కున్నాడు. ఆయన ఏ పాపంలేనివాడైనందుకు కృతజ్ఞతలు, ఆయన మరణం సమస్త పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది. పాపం అడ్డుపడకుండా మనిషి దేవునిదగ్గరకు రాగలిగిన సమయం ఇదే. ఆయన రక్తం మన విమోచనను సాధ్యంచేసింది. ఆయన మరణం ముగింపు కాదు. రెండు రోజుల తర్వాత యేసు మరణంనుండి తిరిగి లేచాడు, మరణంమీద ఆయన శాశ్వతమైన విజయం సాధించాడు. నేడు మనం మరణభయంలేకుండా, నిత్యజీవం గురించి నిరీక్షణతో జీవించగలుగుతున్నాం. ఆయన పునరుత్థానాన్నిబట్టి కృతజ్ఞతలు. యేసు మన విమోచనను సంపూర్తిచేశాడు. ఏ న్యాయాధిపతీ, ఏ అధిపతీ, ఏ ప్రవక్తా, ఏ యాజకుడూ ఇది చేయలేక పోయాడు. యేసు తన సర్వశ్రేష్ఠమైన అర్పణతో దీనిని నెరవేర్చాడు!
తలంపు:
మీరు రక్షించబడడానికి ఉన్న ఏకైక నామం యేసు క్రీస్తు!
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/