విమోచననమూనా

విమోచన

7 యొక్క 1

విమోచించడంకొరకు దేవుడు రావడం

ఆదాము మరియు హవ్వ తమ సృష్టికర్తతో శ్రేష్ఠమైన సంబంధంలో, ఊపిరి కలిగిన ప్రతి ప్రాణిమీద ఏలుబడితో, వారి చుట్టూ రమణీయమైన ప్రకృతిసౌందర్యంతో ఏదెనులో మంచి కాలం గడిపారు. అపరాధం, అవమానం, ప్రతికూలభావన లేదా భయం ఇవేమీ వారిని ఆటంకపర్చలేదు. ఇటువంటి జీవితం గురించి ఊహించండి. ఇది పరిపూర్ణమైన ఆనందానికి దృశ్యం. ఇదంతా ఒకే ఒక క్షణంలో మారిపోయింది, కారణం విత్త బడిన ఒకే ఒక సందేహం, నమ్మబడిన సందేహం, వెనకకు మరల్చడానికి వీలుపడని అవిధేయత. అన్నీ పోగొట్టుకున్నట్టు అయ్యింది – నరుడికి దేవునికి మధ్య ఉన్న ఎడతెగని అన్యోన్యసహవాసం భగ్నమయ్యింది, పరిపూర్ణమైన ప్రపంచం బీటలుపడి కలుషితమయ్యింది. ఎంత గొప్ప విషాదం – అయినప్పటికి అంతా కోల్పోయినట్టు కాదు. ఔదార్యం గల తండ్రి అయిన దేవుడు వెంటనే తన యోచనను అమలుచేశాడు. ఆయన నరుడికి నారికి వారి సిగ్గును కప్పివేయడంకొరకు జంతుచర్మాలను వస్త్రాలుగా ఇచ్చాడు, వారిని ఏదెనులో నుండి వెలుపలికి పంపివేశాడు.

చెప్పకపోయినప్పటికి, దేవుడు తన ప్రజలను వారి పాపాలయొక్క పర్యవసానాలనుండి రక్షించడం కొరకు చేసిన అనేక విమోచనలయొక్క ఏర్పాటులో ఇది మొదటిది. ఆదాము హవ్వలను వస్త్రాలను ధరింప చేయడంకొరకు దేవుడు జంతువులను వధించి వాటి రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అనంతర కాలంలో ఎవరైనా పాపంచేసినప్పుడు ప్రాయశ్చిత్తంద్వారా పాపనివారణచేయడంకొరకు మోషే ఏర్పాటుచేసిన రక్తార్పణ లలో ఇది మొదటిది. ఆదాము హవ్వలను దేవుడు ఏదెనులోనుండి బయటకు పంపించి వారికి గొప్ప మేలు చేశాడు, ఎందుకంటె వారు అక్కడనే ఉండి ఉన్నట్లయితే, అశ్రద్ధతతో వారు జీవవృక్షఫలం తినడం జరిగేది, అయితే వారు అమర్త్యులు కాకుండా దేవుడు వారిని నిషేధించాడు. దీని గురించి మనసులో ఒకసారి ఊహించండి, వయసు మళ్లుతుంది గాని మరణం రాదు! ఇది భూమిమీద నరకం వంటిది. దేవుడు తన మహా ఔదార్యంలో మనుషులకు మరణాన్ని ఏర్పాటుచేశాడు, ఒక రకంగా ఇది ఒక వరం, ఎందుకంటె ఇది భూమి మీద దుఃఖాలన్నిటినుండి ఒక నెమ్మదైన విముక్తి, బాధలేనిది మరియు ఆనందంతో నిండిన పరలోకం గురించి నిరీక్షణ గలది.

ఏదెనువంటి పరిపూర్ణత గల పరిస్థితులలో నేడు మనం నివసించకపోవచ్చు. వాస్తవానికి మనం యుద్ధం, క్షామం, విషాదం మొదలైనవాటితో పీడించబడుతున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఆదాము హవ్వలను విమోచించిన దేవుడు అనంతమైన కృపాప్రేమలు గలవాడు గనక వారి కుమారులు మరియు కుమార్తెలందరిని విడిపిస్తాడు.

తలంపు:

ఆదాము హవ్వలను నిస్సహాయ స్థితినుండి విమోచించిన దేవుడు విడిపించినట్లయితే, ఆయన నీ విషయంలో కూడ అదే చేయగలడు.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

విమోచన

మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్‌ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/