అరణ్యం నుండి పాఠాలునమూనా

అరణ్యం నుండి పాఠాలు

7 యొక్క 7

సమర్పణ అరణ్యంలో విజయాన్ని తెస్తుంది

అతి తక్కువ అరణ్యపు అనుభవం ఏమి తీసుకువస్తుంది అని ఎవరైనా అడిగితే, దానికి సమాధానం ఉండకపోవచ్చు. అరణ్యం కొన్ని వారాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఎక్కడైనా ఉంటుంది మరియు ఇది మన హృదయ పరిస్థితి మరియు వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. మనం కఠిన హృదయంతో,మొండిగా మన మార్గాలలో స్థిరపడి,దేవుణ్ణి పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనం ఎక్కువ కాలం అక్కడ ఉండగలం. బదులుగా, మనం దేవునికి మరియు ఆయన మార్గాలకు సమర్పించుకోడానికి అనుమతించినప్పుడు, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ విజయాన్ని చూడటం ప్రారంభిస్తాము.

సమర్పణ అనేది మన జీవితాల కోసం దేవుని చిత్తానికి ఇష్టపూర్వకంగా విధేయత చూపించడమే. ఇది మన పరిస్థితులలో దేవుని జోక్యానికి అవును అని చెపుతోంది,మన ప్రాణం యొక్క ప్రతి విభాగంలోనూ ఆయనకు అవకాశాన్ని ఇస్తుంది మరియు మనం తీసుకునే నిర్ణయాలలో ఆయన ఆజ్ఞాపించడానికి అనుమతిస్తుంది.

సమర్పణ కష్టంగా అనిపిస్తుంది,ఎందుకంటే మనకు సంబంధించిన విషయాలను నియంత్రించడానికి మరియు తదనుగుణంగా ముందుకు సాగడానికి మనం కట్టివేయబడ్డాము. దీనికి మనం ఇష్టపూర్వకంగా కూర్చోవాలి మరియు దేవుడు మనలో,మనతో మరియు మన ద్వారా ఏమి చేయాలని ఎంచుకున్నాడో దానిని చేయడానికి అనుమతించాలి.

సమర్పణ అనేది వదులుకోవడం కాదు,దేవుని సార్వభౌమాధికారానికి ఇచ్చివేసుకోవడమే. ఇది బలహీనత యొక్క చర్య కాదు,సర్వశక్తిమంతుడైన దేవుని బలం మీద బలీయమైన నమ్మకం.

మీరు ప్రస్తుతం అరణ్యంలో నడుస్తూ ఉన్నట్లయితే, మీరు ఈ ప్రార్థన చేయడానికి ఎంచుకుంటారా?

ప్రార్థన

ప్రేమగల పరలోకపు తండ్రీ, ఈ అరణ్య కాలానికి నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నిజంగా ఎవరో ఇప్పుడు చూస్తున్నాను మరియు నీవు ఇప్పటికీ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని విస్మయం చెందుతున్నాను, నన్ను రక్షించడానికి నువ్వు నీ కుమారుడిని ఈ లోకానికి పంపావు. ఈ సమయంలో దేవుడిగా కొనసాగుతూ ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను- నా చుట్టూ ఉన్నవన్నీ లేనప్పటికీ స్థిరంగా మరియు ఖచ్చితంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. సందేహం మరియు భయంతో మాట్లాడినందుకు మరియు ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను క్షమించు. నువ్వు నా మంచి కోసం అన్ని పనులు కలిసి పని చేస్తారని ఇప్పుడు నాకు తెలుసు. నా జీవితంలో తదుపరి కాలం కోసం నువ్వు నన్ను సిద్ధం చేస్తున్నావని నాకు ఇప్పుడు తెలుసు. నువ్వు ఎంచుకున్న విధంగా నాతో చేయడానికి నేను పూర్తిగా నీకు సమర్పించుకొన్నాను. నేను నీకు సొంతం. నన్ను నీ దగ్గరే పట్టుకో. నాకు అర్థమయ్యేలా మాట్లాడు. నువ్వు కోరుకున్న ప్రకారం నేను మార్పుచెందుదును గాక!

యేసు నామంలో

ఆమెన్.

రోజు 6

ఈ ప్రణాళిక గురించి

అరణ్యం నుండి పాఠాలు

ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/