అరణ్యం నుండి పాఠాలునమూనా

అరణ్యం నుండి పాఠాలు

7 యొక్క 5

క్రమతర్ఫీదు కలిగి నిలిచి యుండడంలో తర్ఫీదు

ఏవైనా క్రీడలను చూసినప్పుడు,క్రీడా కారులు తెరవెనుక వారు చేసిన తీవ్రమైన తర్ఫీదు ఆధారంగా మైదానంలో ఏవిధంగా రాణిస్తారో మనం చూస్తాము. ప్రతి క్రీడాకారునికి వారి క్రీడ మరియు వారు చూపే సాహసం ఆధారంగా తర్ఫీదు భిన్నంగా ఉంటుంది. వారు రాణించడమే కాకుండా క్రమతర్ఫీదుతో మెలగడానికి కూడా తగిన తర్ఫీదు ఇస్తారు. వారు ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో కొన్ని గంటలు పని చేయాలి,అదేవిధంగా జాగ్రత్తగా తయారు చేసిన భోజన పదార్ధాలను తీసుకోవాలి. ఇవి మార్చలేనివి. క్రైస్తవులకు,మన తర్ఫీదులో అధిక భాగం అరణ్యంలోని బంజరు భూములలోనే జరుగుతుంది. పరినతలో ఎదగడానికి మరియు దేవుడు మనలను పిలిచి,మనలను సృష్టించిన వాటన్నిటిలో అడుగు పెట్టడానికి మనం తర్ఫీదు పొందాము.

మనం తీసుకునే తర్ఫీదు మన జీవితంలో క్రమతర్ఫీదును తీసుకువస్తుంది. అరణ్యం మనల్ని ప్రతి రోజును సూక్ష్మమైన దృష్టితో చూచేలా బలవంతం చేస్తుంది. మన జీవితంలోని వివిధ రంగాలలో క్రమతర్ఫీదు లేకపోవడాన్ని మనం కనుగొంటాము. దేవుడు మన జీవితాలలో పునరుజ్జీవింపజేయాలని కోరుకునే ప్రధాన ప్రాంతం మన ఆత్మీయ క్రమతర్ఫీదులు.

ఆత్మీయ క్రమతర్ఫీదులు ఎక్కువగా దేవుడు మరియు మీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది ప్రోత్సాహకాలు కోసం ఉద్దేశపూర్వకత మరియు క్రమబద్ధత అవసరం. ప్రతి ఉదయం ఒక ప్రామాణిక మున ధ్యాన సమయం ప్రారంభించడానికి మంచి ప్రదేశం. అయితే అది అక్కడే శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని చదవడానికి,ప్రార్థించడానికి మరియు ఆయన మీతో మాట్లాడడం అనుమతించడానికి సమయాన్ని కేటాయించే ఆత్మీయ క్రమతర్ఫీదు క్రైస్తవ జీవితంలోని ప్రతి కాలానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ విభాగాలను ప్రారంభించడానికి మరియు పెంచడానికి అరణ్యం గొప్ప ప్రదేశం. జీవాన్ని అనుగ్రహించే తన ఆదేశాలను తన తన ప్రజలు గైకోనాలని మరియు మనం అలా చెయ్యడం ద్వారా ఆశీర్వాదం మరియు విజయం యొక్క వాగ్దానాన్ని అంగీకరించాలనే దేవుని అభిలాషను 81 కీర్తన తెలియపరుస్తుంది.

మీ వారపు కార్యక్రమంలో విశ్రాంతి కోసం ఒక రోజు కూడా ఉందదం మరొక ముఖ్యమైన క్రమతర్ఫీదు. పూర్తి వారం అంతా పని చేసిన తరువాత మన ఆత్మ,ప్రాణం మరియు శరీరం శక్తితో తిరిగి కోలుకోవడానికి మనకు ఎంత విశ్రాంతి అవసరమో ఖచ్చితంగా తెలిసిన సర్వజ్ఞుడైన దేవుడు విశ్రాంతి దినమును స్థాపించాడు. ఈ క్రమతర్ఫీదులు శూన్యంతో కూడిన పునరావృత ఆచారాలుగా మారడానికి ఉద్దేశించినవి కావు,అయితే దేవునితో లోతైన సహవాసంతో కూడిన అర్ధవంతమైన సమయాలు.

మీరూ, నేనూ అరణ్యంలో ఈ ఆత్మీయ విభాగాలను అభివృద్ధి చేయకపోతే,రాబోయే కాలాలలో మనం వీటిని అభివృద్ధి చేయలేకపోయే అవకాశం ఉంది.

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

అరణ్యం నుండి పాఠాలు

ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/