అరణ్యం నుండి పాఠాలునమూనా
అరణ్యం ఒక కఠినమైన ప్రదేశం కాదు అది ఒక చెడ్డ ప్రదేశం
పాత నిబంధనలోని అరణ్యం "గొప్పది మరియు భయంకరమైనది" అని వర్ణించబడింది. ఇశ్రాయేలీయులు దేవుని మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల నలభై సంవత్సరాలు సంచరించిన ప్రదేశం అది. దేవుడు తన సార్వభౌమ జ్ఞానంతో వారిని అరణ్యంలోనికి నడిపించాడు మరియు వారిపక్కనే ఉండి,పాత కాపలాదారు యొక్క పూర్తి తరం అంతా చనిపోయే వరకు వారిని రక్షించాడు మరియు వారికి సమకూర్చాడు. యెహోషువా నాయకత్వంలో కొత్త తరాన్ని వాగ్దానం చేసిన దేశంలోనికి దేవుడు నడిపించాడు.
ఈ రోజు మన జీవితాలలో, అరణ్యం తక్కువ స్థలంగా ఉంటుంది మరియు అది ఎక్కువ కాలం ఉంటుంది. మన పరిస్థితులు,శత్రువులు మరియు పరిమితులతో మనం బలవంతంగా లెక్కించబడడానికి ఇది దేవుడు నిర్దేశించిన కాలం. మనం అనేకమైన మూసి ఉంచిన తలుపుల వెలుపల అలసటతో తిరుగులాడుతున్నప్పుడు ఇది కనిపిస్తుంది. మనం అపార్థం, కలవరంతో కూడిన వేడి ప్రదేశంలో కూర్చున్నట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది. అంతులేని నిరీక్షణ మరియు సమాధానం దొరకని లెక్కలేనన్ని ప్రార్థనల బంజరు ప్రదేశంలా అనిపించవచ్చు.
అరణ్యం కష్టకాలంగా ఉంటుంది అయితే అది ఫలింపు లేకుండా ఉండదు. అంతటా దేవుని మధురమైన సన్నిధికి సాక్ష్యాలను కలిగి ఉంటుంది. మీరు ఊహించని మార్గాల్లో అనుగ్రహాన్ని పొందుతారు మరియు మార్గం అంతటా వర్ణించలేని ఆశీర్వాదాలు కుమ్మరించ బడతాయి. ఎడారి సమయంలో ముందుకు ప్రయాణాన్ని కొనసాగించడానికి మీ కళ్ళను యేసు మీద ఉంచడం మరియు మీ హృదయం, మనస్సులను పరిశుద్ధాత్మ చెపుతున్న మరియు చేస్తున్న వాటి విషయంలో సున్నితంగా ఉండటమే ఏకైక షరతు. ఇది మీ భంగిమ అయినప్పుడు,మీ ప్రతిస్పందన కృతజ్ఞతగా ఉంటుంది. ఆయన చేసిన ప్రతిదానికీ మరియు మీ జీవితంలో ఆయన నిరంతర సన్నిధికోసం కృతజ్ఞతలు. ఏ అరణ్యమూ విశ్వం యొక్క దేవుణ్ణి మీ నుండి దూరంగా ఉంచలేదు. నిజానికి ఆయన అరణ్యానికి దేవుడు కూడా!
ఈ ప్రణాళిక గురించి
ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.
More
ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/