శ్రమ ఎందుకు?నమూనా

శ్రమ ఎందుకు?

3 యొక్క 3

శ్రమ వెనుక దాగి ఉన్న ప్రణాళికలు

ఈ ప్రణాళికలో మన జీవితాలలోనికి ప్రవేశించే శ్రమ వెనుక దాగి ఉన్న పథకం ఏమిటో నేను కొంత వెలుగులోనికి తీసుకురావాలనుకుంటున్నాను. అనేకమార్లు మనం శ్రమ మరియు బాధలను ఎదుర్కొన్నప్పుడు, దాని వల్ల ప్రయోజనం లేదని అనుకుంటాము.

మనం సణుగుతాం మరియు దేవునిని ప్రశ్నిస్తాము. కాని దేవుడు అది ఒక ఉన్నతమైన ఉద్ధేశ్యం(ప్రయోజనం) కోసం జరిగేలా అనుమతిస్తాడు. అదే పరిస్థితిలో ఉన్న అనేకమందికి ప్రయోజనం చేకూర్చే అనేక విషయాలను మనకు బోధించాలని ఆయన కోరుకుంటాడు. ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది.

ఇటీవల నేను తనకు అప్పుడే పుట్టిన కుమార్తెను కోల్పోయిన తల్లిని కలిశాను. ఆమె పడుతున్న బాధను నేను చూడగలిగాను. కాని “సరైన సంరక్షణ లేకుండా చనిపోయే ప్రమాదంలో పుట్టే శిశువులతో ఉన్న తల్లులకు సహాయం చేయాలి” అనుకుంటున్నట్లు ఆమె ఇప్పటికీ పంచుకుంటుంది. ఇలాంటివి శ్రమ మరియు దుఃఖము లాంటి బాధలను అనుభవిస్తున్న ఇతరులను ఓదార్చడంలో మనకు సహాయపడతాయి.

మనం శ్రమ, బాధ మరియు పరీక్షల ద్వారా వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందో వివరించడానికి యోబు పుస్తకం ఒక ప్రాథమిక ప్రయోజనం కోసం వ్రాయబడిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యోబు నీతిమంతుడు, దేవునికి భయపడే వ్యక్తి. అయితే, దేవుడు యోబుకు పెద్ద కుటుంబాన్ని మరియు అనేక ఆస్తులను అనుగ్రహించాడు కాబట్టి యోబు మాత్రమే నీతిమంతుడని సాతాను చూపించుట ద్వారా దేవుని నుండి మహిమను పొందాలనుకున్నాడు. దేవుడు యోబును ఆశీర్వదించుట పై యోబు విశ్వాసం షరతులతో ఉందని సాతాను చూపించాలనుకున్నాడు. తన అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి, సాతాను దేవుని సింహాసనాన్ని సమీపించి, యోబు దేవునిని శపించాడో లేదో చూడడానికి అతనిపై కష్టాలను తీసుకురావడానికి దేవుని అనుమతిని కోరాడు. దేవుడు దీనిని అనుమతించాడు. కాబట్టి యోబు నుండి అతని కుమారులు, కుమార్తెలు మరియు ఆస్తులు తీసివేయబడ్డాయి. ఎన్ని శ్రమలు ఉన్నా యోబు దేవునిని ఆరాధిస్తూనే ఉన్నాడు.

యోబు పుస్తకం లేకుండా బైబిలును ఊహించుకోండి. యోబు శ్రమ మరియు బాధను అధిగమించలేదని అనుకుందాం. ఇలాంటి శ్రమలో ఉన్న చాలా మందికి ఆశ కలిగించడానికి అతని ఉదాహరణ ఉండదు. మన దేవుడు ఎల్లవేళలా తన క్రమంలోనే ఉన్నాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. తరచుగా శ్రమ మరియు బాధలు మన వ్యక్తిత్వాన్ని రూపొందించుటలో సహాయపడతాయి.

అనేక సార్లు దేవుడు మనల్ని స్వనీతిమంతులుగా మారకుండా ఆపుటకు శ్రమను అనుమతిస్తాడు. దేవుడు గర్విష్ఠులను మరియు మితిమీరిన నకిలీ ఆధ్యాత్మికతను ద్వేషిస్తాడు. పౌలు చెబుతూ “తన శరీరంలో ఉన్న ముల్లు తాను గర్వించకుండా మరియు దురహంకారంగా జీవించకుండా ఉండుటకే” అని చెప్పాడు.

ప్రియమైన వారలారా, ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు దేని ద్వారా వెళ్తున్నారో, అదేదియు దేవునికి మరుగు లేదు. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏదీ జరగదు. మీ దృష్టిని ప్రభువుపై ఉంచండి. ప్రభువు తన దృష్టిని మీపై ఎన్నడూ తొలగించనందున, శ్రమ యొక్క తీవ్రత లేదా లోతుతో సంబంధం లేకుండా, ఆయన నామ మహిమార్ధం మీరు జయించి విజయం సాధించుటకు ఆయన మీకు చాలును.

నా ఉచిత ఈ- బుక్ : ‘ శ్రమ ఎందుకు?’ అను ఈ శీర్షికను పొందుకొనుటకు మా వెబ్‌సైట్ : https://www.evansfrancis.org/ కి లాగిన్ అవ్వండి.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

శ్రమ ఎందుకు?

ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లో దేవునితో మరియు ఆయన వాక్యముతో ప్రతిరోజూ 10 నిమిషాలు ఏకాంతముగా (ఒంటరిగా) దేవుడు మన జీవితాల్లో శ్రమను మరియు బాధలను ఎందుకు అనుమతించాడో మీరు నేర్చుకుంటారు. ఈ ప్రణాళికలో చేరండి మరియు శ్రమ వెనుక దాగి ఉన్న ఉద్ధేశ్యాలను కనుగొనండి.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Evans Francis కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.evansfrancis.org