శ్రమ ఎందుకు?నమూనా
శ్రమ దేవునిని ఎలా మహిమపరుస్తుంది?
మీరు శ్రమ నుండి తప్పించుకోలేరు. ఇది మీ జీవితంలోకి వస్తుందా ? లేదా మీకు చాలా సన్నిహితంగా ఉన్నవారికి జరుగుతుందా? అనేది విషయం కాదు; దానికి బదులుగా, ఇది ఎప్పుడు ? మరియు ఎంత ? అనేది విషయం. మీరు ఒక తుఫాను నుండి బయటకు వస్తున్నారు లేదా మరొక తుఫానుకి వెళుతున్నారు.
దేవుడు కొన్నిసార్లు మనలను శ్రమలు, బాధ లేదా కష్టాలు,పరీక్షల ద్వారా వెళ్ళడానికి అనుమతిస్తాడు, దీని ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. షడ్రక్, మేషాక్, అబేద్నెగో మరియు దానియేలు తమ విశ్వాసంలో స్థిరంగా నిలిచారు మరియు శ్రమ (పరీక్ష) సమయంలో దేవునికి ఫిర్యాదు చేయలేదు కాని సజీవుడైన దేవునిపై నమ్మకం ఉంచారు. ఫలితంగా, దేవుడు మనుష్యుల ముందు నలుగురినీ ఎలా ఆశీర్వదించి, గౌరవించాడో మీరు చూడవచ్చు.
ఇశ్రాయేలీయులను మొదటి తెగులు తర్వాత ఐగుప్తును విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేయలేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళని పది తెగుళ్ళ గుండా ఎందుకు వెళ్ళనివ్వలేదు? వాస్తవానికి దేవుదు వాటిని తొలగించి ఉండవచ్చు. కాని దేవుదు అలా చేశాడా? లేదు. ఎందుకు?
తన శక్తిని ప్రదర్శించడానికి మాత్రమే తద్వారా తన నామము మహిమపరచబడుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులను పది తెగుళ్ల నుండి ఎలా విడిపించాడో అనేది ఒక అద్భుతం. కాని దేవుడు చూపించాల్సినది ఇంకా ఉన్నది. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోవడం చివరి అద్భుతం. దేవుడు తాను విడుదల చేయాలనుకున్న వారిపై తన అద్భుత హస్తాన్ని ఉంచుట మరియు శిక్షించాలనుకున్న వారిపై ఆయన తీర్పును చూపించడానికి ఫరో హృదయాన్ని కఠినపరచుట కూడా ప్రక్రియలో భాగమే.
యోహాను 11వ అధ్యాయం చదివినప్పుడు- లాజరు మరణం నుండి ఎలా లేపబడ్డాడనే దాని గురించి మనం చూడగలం. తన మంచి స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని యేసు తెలుసుకున్నప్పుడు, “ఈ అనారోగ్యం దేవుని మహిమ కోసమే” అని చెప్పాడు. నాలుగు సువార్తలలో కూడా, యేసు అనారోగ్యంతో ఉన్నవారిని మరియు చనిపోయినవారిని కూడా చేరుకోవడానికి ఇష్టపడటం మనం చూడవచ్చు. ఉదాహరణకు, యాయిరు కుమార్తె మరియు నాయీను విధవరాలి కుమారుడు. అయితే, లాజరు విషయంలో యేసు ఉద్దేశపూర్వకంగానే తన రాకను (సందర్శనను) నాలుగు రోజులు ఆలస్యం చేశాడు. కారణం: ఆశ్చర్యకరమైన అద్భుతం ద్వారా దేవుని నామం మహిమపరచబడాలని. యేసు ఆ విషాద మరణాన్ని మరల జీవముగా మార్చాడు. దేవుడు దానియేలు, అతని స్నేహితులు మరియు లాజరు జీవితాలలో చేసినట్లుగా ఇప్పుడు పని చేయగలడు. దేవునికి సరైన సమయం తెలుసు, మరియు అతను తన సమయంలో అన్నీ చక్కగా చేస్తాడు.
మీరు కూడా, మీకు అర్హత లేదని భావించే తీవ్రమైన సమస్యల గుండా వెళ్తుండవచ్చు. కాని నేను మీకు చెప్పాలనుకున్నదేమనగా, నా ప్రియమైన సహోదరుడ / సహోదరి, దేవుడు తన పనిని చేయడానికి అనుమతించండి. ఆ పని పూర్తయినప్పుడు, మీపై ఉన్న ఆయన హస్తానికి మీరు ఆశ్చర్యపోతారు.
మీరు ఆశీర్వదించబడినా లేదా క్లిష్ట పరిస్థితిని (సంక్షోభాన్ని) ఎదుర్కొంటున్నా సరే మీరు సంతృప్తిగా ఉన్నప్పుడే మీరు ధనవంతులు. ఏది ఏమైనా దేవుని నమ్మడం నేర్చుకోండి. మీరు దేవుని విశ్వసించి, ఆయన మీ ద్వారా తన పని చేయనివ్వండి. ఎటువంటి అగ్ని లేదా సింహం, మరణం కూడా మీకు హాని కలిగించదు. మీ సృష్టికర్త మిమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు మరియు తన నామ మహిమ కొరకు ఆయన రాజ్యం విస్తరిస్తుంది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లో దేవునితో మరియు ఆయన వాక్యముతో ప్రతిరోజూ 10 నిమిషాలు ఏకాంతముగా (ఒంటరిగా) దేవుడు మన జీవితాల్లో శ్రమను మరియు బాధలను ఎందుకు అనుమతించాడో మీరు నేర్చుకుంటారు. ఈ ప్రణాళికలో చేరండి మరియు శ్రమ వెనుక దాగి ఉన్న ఉద్ధేశ్యాలను కనుగొనండి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Evans Francis కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.evansfrancis.org