శ్రమ ఎందుకు?నమూనా
నీవు మరియు శ్రమ
ఎందుకు మనం శ్రమను అనుభవించాలి? ఎందుకు దేవుడు దానిని మొదటిగా అనుమతించాడు? శ్రమను అనుభవించటానికి నేను ఏమి చేశాను? ఎందుకు? ఎందుకు? ఎందుకు?
అయితే ఈ సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గొప్పతనం కోసం మిమ్మల్ని సిద్ధం చేయడానికి దేవుడు నొప్పిని ఉపయోగిస్తాడు. బంగారం ఏ విధముగా ప్రశస్తమైనది మరియు విలువైనది అవుతుంది? అది వేడి, మండే అగ్ని ద్వారా పుటము (శుద్ధి) చేయబడినప్పుడు. మీరు వేడి చేయకుండా బంగారాన్ని శుద్ధి చేయలేరు కాని అది మండుతున్న ప్రక్రియ నుండి బయటకు వచ్చినప్పుడు, మనము దానిని స్వచ్ఛమైన రూపంలో పొందుకుంటాము. అగ్నిలో వేయకుండా స్వచ్ఛమైన బంగారాన్ని పొందడం అసాధ్యం. అదే విధంగా, దేవుడు మన జీవితాల్లో శ్రమలనే అగ్ని ద్వారా మనలను విలువైన వ్యక్తులనుగా చేస్తాడు.
శ్రమ అనివార్యం మరియు ఎవరితోనూ పంచుకోలేరు. బాధపడే వ్యక్తి ఒంటరిగానే భరించాలి. ఇది జీవితంలో అంతర్భాగం మరియు తప్పించుకోలేము. అయితే, మనం దానితో ఎలా జీవించాలో నేర్చుకోవాలి మరియు దాని ద్వారా విజయం సాధించాలి.
అనారోగ్యం నాకు కొత్తేమీ కాదు, ఎందుకంటే నేను నా జీవితంలో 70 శాతం మందులమీద ఆసుపత్రుల్లోనే గడిపాను. ఇదంతా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నేను ఆశ్చర్యపోయాను. రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, “దేవుడు నాపై కోపంగా ఉన్నాడు మరియు అతను నాకు గుణపాఠం చెబుతున్నాడు” అని ప్రజలు నన్ను తీర్పు తీర్చడం. నేను పాపంలో జీవిస్తున్నానని వారు నిర్ధారించారు మరియు అనేకమైన ఆరోపణలు చేశారు. నేను నిందింపబడినవాడిగా భావించాను. కానీ నేను లేఖనాలను చదవడం ప్రారంభించినప్పుడు, నేను పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని (ఉద్ధేశ్యాన్ని) కనుగొన్నాను. మనలని విరుగగొట్టుటకు , శ్రమను అనుభవించడానికి దేవుడు మనలను అనుమతించడని నేను ఆశను మరియు అవగాహనను పొందాను. దీనికి విరుద్ధంగా, శ్రమ మనలను ఒక పెద్ద దీవెనకు సిద్ధం చేస్తుంది.
బాడీబిల్డర్ కావాలని కలలు కనే వ్యక్తి వ్యాయామం యొక్క బాధను అంగీకరించకపోతే తన లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేడు. అదే విధంగా, దేవుడు నిన్నునలగగొట్టుటకు మరియు మీకు శిక్షణనిచ్చేందుకు శ్రమను అనుమతిస్తాడు, తద్వారా మీరు ఉపయోగకరమైన పాత్రగా మారవచ్చు.
కుమ్మరి నేలపై ఉన్న మట్టి కుప్ప నుండి సాధారణమైన మట్టి ముద్దను ఎంచుకుంటాడు. కుమ్మరి తన మనస్సులో తను అనుకున్న చివరి(తుది) వస్తువును (ఉత్పత్తిని) కలిగి ఉంటాడు, ఆ చివరి వస్తువు ఉత్పత్తి కోసం ఉపయోగపడే పాత్ర మట్టి. మట్టి కుమ్మరితో సహకరిస్తుంది మరియు శ్రమను అనుభవిస్తుంది, కుమ్మరి ఏమి చేసినా దానికి విలువ వస్తుంది అని తెలుసుకొవాలి. అదేవిధంగా, మనం దేవునికి సహకరించాలి. శ్రమలను తిరస్కరించుట వల్ల ఏమి జరగదు. అది మిమ్మల్ని రాజీపడే స్త్రీగా లేదా పురుషునిగా మాత్రమే చేస్తుంది. అంతేకాక దేవుని రాజ్యంలో మీకు చోటు కూడా లేకుండా చేస్తుంది.
జ్ఞాపకముంచుకోండి, శ్రమ నాశనం చేయడానికి కాదు. బదులుగా అది మీలో క్రీస్తు స్వభావాన్ని (గుణాన్ని) నిర్మిస్తుంది. ఇది మీ చివరి శ్వాస వరకు క్రీస్తు పోలికలో ఎదగడానికి మీకు సహాయపడుతుంది. కాబట్టి, మీరు శ్రమను అంగీకరించండి మరియు మీరు దాని గుండా వెళుతున్నప్పుడు (శ్రమని అనుభవిస్తున్నప్పుడు) దేవుని మహిమపరచండి. శ్రమ లేకుండా లాభం లేదని గుర్తుంచుకోండి.
ఈ ప్రణాళిక గురించి
ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లో దేవునితో మరియు ఆయన వాక్యముతో ప్రతిరోజూ 10 నిమిషాలు ఏకాంతముగా (ఒంటరిగా) దేవుడు మన జీవితాల్లో శ్రమను మరియు బాధలను ఎందుకు అనుమతించాడో మీరు నేర్చుకుంటారు. ఈ ప్రణాళికలో చేరండి మరియు శ్రమ వెనుక దాగి ఉన్న ఉద్ధేశ్యాలను కనుగొనండి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Evans Francis కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.evansfrancis.org