ప్రత్యేకంగా ఉండండినమూనా

మీ ఇంటిలో సాక్షిగా ఉండండి
7:12-24: 12-16 వచనాలలో అపొస్తలుడైన పౌలు వివాహిత క్రైస్తవులను ఉద్దేశించి ప్రస్తావిస్తూ విడాకులు తీసుకోకుండా ఉండమని ఆజ్ఞాపించారు. తర్వాత 17-24 వచనాలలో క్రైస్తవులు వేర్వేరు నేపథ్యాల నుండి రక్షించబడ్డారని మనం చూస్తాము. వారి సామాజిక, ఆర్థిక, మరియు మతపరమైన నేపథ్యం ఎలా ఉన్నా క్రైస్తవులుగా జీవించాలని పౌలు చెప్పడం జరిగింది.
కొరింథీయులు రక్షింపబడిన తరువాత పరిణామాలను ఆలోచించకుండా వారి జీవితాల్లో చాలా మార్పులు చేయాలనుకున్నారు. కాని వారు ఏ పరిస్థితిలో ఉన్న క్రైస్తవులుగా ఉండాలని పౌలు వారికి వ్రాసారు.
క్రీస్తు కొరకు జీవించడానికి మన స్థితిని కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మీరు మీ వివాహం తర్వాత ఒక విశ్వాసిగా ఉండి మీ జీవిత భాగస్వామి ఇంకా రక్షింపబడకపోతే, మీరు మీ జీవిత భాగస్వామితో వివాహ భంధంలోనే ఉండాలి. అలంటి పరిస్థిలో కూడా ప్రభువు కోసం జీవించవచ్చు. అంతేకాక, కుటుంబంపై దైవిక ప్రభావం చూపడానికి దేవుడు క్రైస్తవ భాగస్వామిని ఉపయోగించవచ్చు. రక్షింపబడిన జీవిత భాగస్వామి ద్వారా అవిశ్వాసియైన జీవిత భాగస్వామిలో మరియు పిల్లలలో దేవుడు పని చేయగలడు. కాబట్టి మీ ఇంట్లో సాక్షిగా ఉండండి.
ప్రార్థన: ప్రభువా, నా ఇంట్లో నమ్మకమైన సాక్షిగా ఉండటానికి నాకు సహాయం చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/