ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రభువు యందే అతిశయించండి
4:6-21: 1 కొరింథీయులకు 4:6-13 లో కొరింథీయులు ఆధ్యాత్మికంగా ధనవంతులని చెప్పుకుంటున్నారు కాని లోకం అపోస్తులను ధిక్కరిస్తుందని పౌలు వ్రాసారు. తర్వాత 14-21 వరకు పౌలు కొరింథీ విశ్వాసులను ఆధ్యాత్మిక వినయం కలిగి జీవించమని సవాలు చేసారు.
మనమందరం మన స్వంత జ్ఞానం లేదా బలం వల్ల కొన్ని విషయాలు సాధించామని అతిశయిస్తాము. దాని
ఫలితంగా మనము మన విజయాల గూర్చి గొప్పలు చెప్పుకుంటాము. కొన్నిసార్లు మనము మన ఆధ్యాత్మిక విజయాల గూర్చి కూడా గర్వపడుతుంటాము.
మనకు ఉన్న వరాలు, ప్రతిభలు, సామర్ధ్యాలు, మరియు ఆశీర్వాదాలు దేవుని నుండి పొందుకున్నాము అని గుర్తుంచుకోవాలి. మనకు ఉన్న వరాలన్ని దేవుని వద్దనుండి పొందుకున్నామని ఒప్పుకుంటే మనము గర్వించము. అందుకు బదులుగా మన్నల్ని మనము తగ్గించుకొని కృతజ్ఞతతో నిండిన హృదయాలను కలిగి ఉంటాము. మన గొప్పతనాన్ని బట్టి అతిశయించడానికి ఎటువంటి కారణం లేదు. ప్రభువు యందే అతిశయించండి.
ప్రార్థన: ప్రభువా, నన్ను నేను తగ్గించుకోడానికి మరియు మీరు నాకిచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి జీవించుటకు నాకు సహాయముచేయండి. నీలోనే అతిశయించుటకు సహాయం చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/