దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా
మీకు సంరక్షకుడు అవసరమైనప్పుడు
గొప్ప జర్మన్ బైబిలు పండితుడు, సంస్కర్త సంస్కర్త మార్టిన్ లూథర్ తన కాలంలోని అవినీతిమాయమైన మతపర, రాజకీయ వ్యవస్థను సవాలు చేయడానికి ధైర్యం చేశాడు. సాంప్రదాయ వ్యతిరేకిగా కాల్చివేయబడే ప్రమాదం ఉన్నప్పటికీ లూథర్ ధైర్యంగా లేఖనాన్ని చదివి బోధించాడు. అతని రచనలు చాలా ప్రభావవంతమైనవి, ఉద్రేకపూరితమైనవి కూడా. మతపరమైన స్థాపనలోని అవినీతి పద్ధతులను బహిరంగంగా సవాలు చేయడం, వాటిని వ్యతిరేకించడం ద్వారా అతను తనను తాను పరిశీలనలోకి తెచ్చుకొన్నాడు, ఫలితంగా అది అతని ఉరిశిక్షకు దారితీసింది.
అయినా 1521 సంవత్సరం డియట్ ఆఫ్ వోర్మ్స్ దగ్గర చక్రవర్తి చార్లెస్ V యెదుట మార్టిన్ లూథర్ స్థిరంగా నిలిచాడు, ఒప్పుకోడానికి నిరాకరించాడు. అధికారులు అతనిని బయటికి తీసుకెళ్తుండగా, అతని అనుచరుల బృందం, దాడి చేసేవారి మారువేషంలో, గుర్రంపై ప్రయాణించి, ఒక జర్మన్ కోటకు మార్టిన్ లూథర్ ని తీసుకొనివెళ్ళి, అక్కడ అతనిని దాచిపెట్టారు. రెండేళ్లపాటు అతనికి అవసరమైనవన్నీ అందించారు. లూథర్ జీవితంలోని చీకటి కాలంలో, దేవుడు అక్షరాలా ఒక శక్తివంతమైన కోటనూ, నిరంతర సదుపాయాన్నీ, ప్రతికూల పరిస్థితుల మధ్య ఆనందాన్ని, తుఫాను మధ్యలో ప్రశాంతతను అందించాడు.
దేవుడు అటువంటి రక్షణను ఎప్పుడూ పంపించడు. నా తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన మాతో ఉన్నాడు, ఆయినా ఆమె చనిపోయింది. కొన్నిసార్లు దేవుడు తన ప్రజలకు భయంకరమైన ప్రమాదం ఎదురైనప్పుడు నిర్భయతను ఇస్తాడు అయితే దాని నుండి వారిని విడిపించడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో స్తెఫను విషయంలో అదే జరిగింది. తను దైవదూషణ చేసినట్టు తన మీద తప్పుగా ఆరోపణ చేసిన మత నాయకులను ధైర్యంగా సవాలు చేశాడు, అయితే స్తెఫనుకు శక్తివంతమైన సాక్ష్యం ఉన్నప్పటికీ, దుర్మార్గుల ఉద్దేశాలను అమలు చేయడానికి దేవుడు అనుమతించాడు (అపొస్తలుల కార్యములు 7:57-60) అయినా ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, బలాన్ని అందిస్తున్నాడు, శాశ్వతమైన ఉద్దేశాలను నెరవేరుస్తున్నాడు.
దేవుని కాపుదల మనం బైబిలు గ్రంథంలోనూ, చరిత్రలోనూ చదివిన ఆధ్యాత్మిక “గొప్ప వ్యక్తుల” కు మాత్రం కాదు. వారు సాధారణ ప్రజలు, వారు దేవుని వాక్యం ప్రకారం దేవుణ్ణి విశ్వసించడానికీ, ప్రతిస్పందించడానికీ నేర్చుకొన్నారు. వాస్తవానికి, మనలో చాలామందిమి ఘనులం, ధైర్యవంతులం, దైవభక్తికలిగినవారం, అన్నింటినీ కలిగియున్నవారం కనుక మనం విశ్వసించడం కాదు నమ్మడం నేర్చుకుంటారు, ఎందుకంటే మేము గొప్ప, ధైర్యవంతుడు, దైవభక్తిగలవాళ్ళం, మరియు ఇవన్నీ కలిసి ఉండటం వల్ల కాదు,కానీ మనం మరో ఎంపిక లేదు. మీకు దేవుడు అత్యవసరంగా కావలసిన సమయంలోనే దేవునితో అనుభవాన్ని కలిగియుంటారు. మీ చీకటి క్షణాల్లో, ఆయన మీ శక్తివంతమైన కోటగానూ, మీకు గొప్ప శక్తిగానూ ఉంటాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/