దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

10 యొక్క 5

మీరు భయంతో పట్టబడినప్పుడు

నా బైబిలు అంచులలో 46 వ కీర్తన పక్కన ఆకుపచ్చ సిరాలో వ్రాసిన ఒక వివరణ ఉంది: “డ్యూక్ మెడికల్ సెంటర్, 2/19/92. (అమ్మ చనిపోతోంది.)” దానిని నేను రాసినట్లు నాకు జ్ఞాపకం ఉంది. ఈ కీర్తనలోని వాక్యాలలో నేను తీవ్రంగా  మునిగిపోయానో నాకు జ్ఞాపకం ఉంది. దేవుడే నా ఆశ్రయంగానూ, బలముగానూ కావాలి. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉండాలి. భయం గుప్పెట్లలోనుండి స్వతంత్రుడిని కావాలి. 

గాలి తుఫాను హింసాత్మక గాలులలో సముద్రం అలలతో పెరుగుతున్నట్లు ఊహించండి. దాని జలాలు గర్జిస్తున్నాయి, నురుగుకట్టి పైకి వస్తున్నాయి. నేను ఆవిధంగా తలంచాను. కీర్తనాకారుడు తన సంక్షోభాన్ని మనకు తెలియజేస్తున్న చిత్ర పటం. ఇది చాలా ప్రమాదకరమైన, బలమైన సంకట స్థితి. అతని అంతఃప్రేరణ దేవుని వైపుకు తిరగడమే. ఇటువంటి గందరగోళ సమయాలలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు.

మన జీవితపు తుఫానులలో దేవుడు మనకు సహాయం చేసే మూడు మార్గాలను ఈ కీర్తన తెలియచేస్తుంది. (1) ఆయన మన ఆశ్రయం, మన చుట్టూ ఉన్న బాహ్య శక్తుల నుండి మనకు రక్షణ. ఆయన ఆ శక్తులను ఎప్పుడూ తొలగించడు, అయితే ఆయన తన హస్తాలను మన చుట్టూ ఉంచుతాడు, ఏ కోటకన్నా లేదా ఆశ్రయం కన్నా గొప్ప ఆశ్రయం అవుతాడు. (2) ఆయన మన బలం-సమీపంగా ఉండి క్షణంలో భరించే అంతర్గత శక్తి. ఆయన ఈ బలాన్ని రేపటి కోసం నిల్వ చేయడు. ఆయన ఈ రోజుకు కావలసిన కృపను మనకు దయ చేస్తాడు. రేపటి కోసం తన కృపను రేపు అనుగ్రహిస్తాడు. ప్రతీ దినం మనకు అవసరమైన కృపను ఆయన ఇస్తాడు. (3) ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మన పరిస్థితులు ఎలాంటి ఆకస్మికమైనవి అయినా, అనివార్యమైనవి అయినా ఆయన తక్షణమే అందుబాటులో ఉంటాడు.

నిత్యమూ మనతో ఉండేవాడూ, ఆశ్రయం ఇచ్చేవాడూ, బలపరచు దేవుని గురించిన అద్భుతమైన చిత్రపటాన్ని సువార్తలు ఇస్తున్నాయి. గలిలయ సముద్రంలో శిష్యులమీద ఒక హింసాత్మక తుఫాను వచ్చింది, వారు భయపడ్డారు. వారు యేసును మేల్కొల్పారు. వారి చుట్టూ అలలు చుట్టుముట్టినా ఆయన నిద్ర పోగల్గాడు. ఆయన ఆ తుఫానును శాంతింపజేశాడు. ఆయన వారితో పడవలో ఉన్నాడు, ఆయన తన బలాన్నీ, కాపుదలనూ అనుగ్రహిస్తున్నాడు - ఈ రోజు మనతో ఉన్నట్లే ఉంటాడు.

దేవుడు మీ కోసమేనని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మీ పక్షంగా ఉన్నాడు. మీరు గందరగోళానికి గురయ్యేంత వరకూ ఆయన వేచి ఉండడు. ఆయన మిమ్మల్ని సరిదిద్దుతాడు. మీరు భయంతో పట్టుబడినప్పుడు కూడా ఆయన మీ కోసం మీతో ఉన్నాడు-మీరు ఎదుర్కొనే ఎటువంటి పరిస్థితిలోనైనా మీ నిజమైన భద్రత ఆయనే.

వాక్యము

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడం

నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.

More

ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/