దేవుని శక్తినీ, సన్నిధినీ అనుభవించడంనమూనా
సమస్యలు అధికంగా కనిపించినప్పుడు
యెల్ యెలియోన్ అక్షరార్ధమైన అర్థం, "దేవుడు సర్వోన్నతుడు." అంటే దేవుడు సృష్టికర్త, విశ్వానికి సంరక్షకుడు అని సూచిస్తుంది. సమస్త మనుష్యులూ, శక్తులు, అధికారాలూ లేదా సమస్యలన్నిటికంటే ఆయన అధికుడిగా ఉన్నాడు అని అంగీకరించడం. కనుక ఆసాపు దేవుణ్ణి యెల్యోన్ అని సూచిస్తున్నప్పుడు, కీర్తన 77:10, ఆయన ఒక శక్తివంతమైన ప్రకటన చేస్తున్నాడు. కనానీయులు తమ నగరాలనూ, స్థానిక ప్రకృతి శక్తులను పరిపాలిస్తారని నమ్ముతున్న దేవతల మాదిరిగా తన దేవుడు లేడని అతడు తనకు తాను జ్ఞాపకం చేసుకొంటున్నాడు. ఆసాపు తన మనస్సును దేవుని గొప్ప కార్యాలూ, దేవుని మార్గాలను గురించిన అవగాహన ఆధారంగా నూతమైన, వాస్తవమైన దృక్పథంలో శిక్షణ ఇస్తున్నాడు.
ఆసాపు అంతటితో ఆగిపోలేదు. “అద్భుతాలను చేసే దేవుడు”గురించి ఆలోచించాడు (వ. 14). అతడు దేవుని శక్తివంతమైన బాహుబలమును గురించిన రూపాన్ని చిత్రించాడు (వ.15). దేవుని ప్రజలకు సహాయం అవసరమైన అన్ని సమయాలనూ, దేవుడు వచ్చి వారికి సహాయం చేసిన సమయాలను ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. సముద్రపు నీరు ఏవిధంగా పాయలైపోయింది, అంతరిక్షం ఘోషించడం, ఆకాశం ఉరమడం, భూమి కంపించడం. (వచనాలు 16-18). అతడు తన ఆలోచనలను దేవుని గురించిన ప్రాథమిక విషయాలకు తీసుకువచ్చాడు- ఆయన పరిశుద్ధత, ఆయన శక్తి, విమోచించడానికి ఒత్తిడి చేసే ఆయన ప్రేమ, కరుణ. తన నిరాశ లోతులలో, మనుష్యులను వెలుపలికి తీసుకొని వచ్చే దేవుని మీద తన మనస్సును నిలపడానికి నిశ్చయించుకున్నాడు. అతనికి ఏదీ కష్టం కాదు.
మీరు నిరాశకు గురైనప్పుడు, చిన్న కొండలు పర్వతాల వలె కనిపిస్తాయి. మీరు ఆరాధనలో నిరంతరం కొనసాగినప్పుడు ఆ చిన్న కొండలు వాటి సాధారణ పరిమాణానికి తిరిగి వస్తాయి, మరియు దేవుడు మీ హృదయంలోనూ, మనస్సులోనూ వాటిని అధిగమించేలా చేస్తాడు. దృక్పథం అనేది అత్యధికమైన వ్యత్యాసాన్ని తీసుకొనివస్తుంది. కంటికి చాలా దగ్గరగా ఉన్న ఒక చిన్న సమస్య ఉన్నట్లయితే అది మిగతావాటన్నిటినీ చూడలేకుండా చేస్తుంది. మీరు మరిదేనినైనా చూస్తున్నట్లయితే మీరు ఆ సమస్య బింబము ద్వారా చూస్తారు. వెనుకకు తీసుకొని వచ్చి దానిని సరైన దృష్టి కోణం నుండి చూడటం అంటే ఏమిటో ఆసాపు చూపించాడు. నిరీక్షణ అనేది నిరాశకు శక్తివంతమైన విరుగుడు, అయితే దేవుడు మహోన్నతుడు, ఆయనతో పోల్చినప్పుడు సమస్యలు సూక్ష్మమైనవని మీరు తిరిగి కనుగొనే వరకు మీరు దానిని కలిగి ఉండలేరు.
77 వ కీర్తన భారీ సమస్యలతోనూ, చిన్న దేవునితోనూ ప్రారంభమవుతుంది. మహొన్నతుడైన దేవుడూ, చిన్న సమస్యలతోనూ ఈ కీర్తన ముగుస్తుంది. ఆ విధంగా దృక్పథం పనిచేస్తుంది. ఆ విధంగా మన ఆశా భావం తిరిగి వెలిగించబడుతుంది. ఆ విధంగా నిరాశ దాని బలాన్ని కోల్పోతుంది. మన భీకర సమస్యలూ, బాధ అంతా కూడా మనం దేవుడెవరో చూడగలిగినప్పుడు అవి దేవునికి మోకరిల్లుతాయి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
నీవు గాయపడినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా తెలుసుకుంటావు? గందరగోళాన్నీ, భయాన్నీ ఆయన ఏ విధంగా స్పష్టత లోనికీ, శాంతి లోనికీ మార్చగలడు? అనేక కీర్తనలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరంభం అవుతాయి, దేవుని సన్నిధీ, శక్తీ, సమకూర్పును గూర్చిన సాక్ష్యంతో అవి ముగుస్తాయి. వాటిలోని సత్యాలను నేర్చుకోవడం, వాటి మాదిరులను అనుసరించడం ద్వారా మనమూ అదే సాక్ష్యాన్ని కలిగి యుండగలం. దేవుడు మనకు ఎక్కువగా కావలసిన సమయంలో ఆయనను మనం పొందగలం.
More
ఈ ప్రణాళికను అందించినందుకు లివింగ్ ఆన్ ది ఎడ్జ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://livingontheedge.org/