దేవునికి కృతఙతలు అర్పించుటనమూనా
తన మహిమనుబట్టియు...
ఇప్పటి వరకు కలిగి యన్న దాని కొరకు వందనములు చెల్లించుచున్నాను.కృతజ్ఞతారృణ పండుగ సమయమునందు ఆనేకులు "నల్ల శుక్రవారము" (Black Friday) నందు సెలవుదినపు కొనుగోలు చేయుట కొరకు పరుగెత్తు చుండగా కొంతవరకు నిదానించి కృతజ్ఞతను బయలుపరచుటకు యిదివరకు ఎంతగా ఫొందియున్నామో వాటి కొరకు కృతజ్ఞత చెల్లింప వలసిన దానిని జ్ఞాపకము చేసికొన వలిసియున్నది.
"మురికి దుస్తులు" కధను చెప్పాలని కోరుచున్నాను. (డాన్ అస్యుసక గారు ఫేస్ బుక్ నందు చెప్పి యుండిరి). దాని గుర్చి ధ్యానించ వలెనని కోరుచున్నాను
ఒకదినమున ధనికుడగు తండ్రి తన కుమారుని వెంట పెట్టుకొని బీద ప్రజలెట్లు బ్రతుకుచున్నారో చూపుటకు ఒక పల్లెటూరికి తీసికొని వెళ్ళెను. కొన్ని దినములు పొలములో ఒక కుటుంబముతో గడిపిరి. ఆ కుటుంబీకులు వారికి ఆతిధ్యమిచ్చుటకు అంత ఎక్కువగా లేకుండెను.
వారు తిరిగి వచ్చిన పిదప తండ్రి కుమారుని ప్రశ్నించెను. మనం వెళ్ళిన ప్రయాణమును మెచ్చుకొనుచున్నావా? ఔనని కుమరుడు జవాబు చెప్పెను. బీదవారు ఏ రీతిగా బ్రతుకుచున్నారో చూచితివా? అనియు అడిగెను. ఔనని కుమరుడు చెప్పెను. మన ప్రయాణమును గురించి ఏమీ నేర్చు కొంటివి? అని మరోక ప్రశ్నను తండ్రి వేసెను. కుమారుని జవాబు ఇదియే
మనకు ఒక కుక్క ఉన్నది. వారికి నాలుగు కుక్కలు ఉన్నవి. మన తోట మధ్య వరకు నీటి గుంట ఉంది వారికి చిన్న సముద్ర శాఖ పొదవునా ఉండగా వారు ఈదగలుగుచున్నారు. మనకు తోటలో లాంతరులున్నవి వారికి రాత్రులందు నక్షత్రములు ఉన్నవి. మనకు ఖాళీస్థలం ముందు గల స్థలమే. వారికి దీక్ష దళము ఉన్నది. మనకు నివసించుటకు కొద్ది స్థలము ఉన్నది వారికి దృష్టి చూడలేనంతటి పొలములున్నవి. మనకు పనివారు గలరు కాని వారు వారే ఇతరులకు పరిచర్య చేయుచున్నారు. మనకు ఆహారమును కొనుగోలు చేసికొనుసున్నాము . వారు ఆహారమునే పండించు కొనుచున్నారు. మన భద్రత కొరకు యింటి చుట్టు గోడలు గలవు. వారి భద్రత కొరకు వారి మిత్రులు ఉన్నారు.
తండ్రి యేమియు మాట్లాడలేక పోయెను. మరియు కుమారుడు తండ్రితో “ధనికులై యుండుట ఎమో చూపినందుకు వందనములు” అని చెప్పెను. ఒకరికి విలువ లేనివి మరొకరికి ఐశ్వర్యముగానున్నది! ఇదంతయు వ్యక్తిగత భావముపై ఆధార పడియున్నది. నిజమగు ఐశ్వర్యము నీకు ఏమి గలదు ? సరుకులు, వస్తువులు, కలిగి ఉన్నవి మొదలగునవి, లేక దేవునితో ఉండు సహవాసమా? నీలో నుండు శాంతియా, ఇతరులతో నుండు స్నేహమా? ఇట్లు పోల్చుకొనుట యనునది తృప్తిని లేకుండా చేయుచున్నదని ఒక నానుడి. అసలైన ఐశ్వర్యము తరచుగా మరచి పోవుచున్నాము. దానికి బదులుగా లేని వాటి కొరకు చింతించుచు వాటిని పొంద గోరుచున్నాము. బైబిలు చెప్పుచున్న దే మనగా సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై యున్నది. మనము లోకములోనికి ఏమియు తెలేదు. దీనిలో నుండి ఏమియు తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై యుండి వాటిలో తృప్తి పొందియుందము .(1 తిమోతి 6:6-8)
తృప్తి మరియు కృతజ్ఞత అను రెండును దేవుని రాజ్యము నందు మూలాధారమైన విలువలు. అనుదిన జీవితమునందు కనబరచుటకు ప్రాముఖ్యమైనవి. మన అవసరాలను తీర్చుటకు దేవుడు కోరుతుండగా మనము యిదివరకు కలిగియున్న వాటితో తృప్తి పొందవలసి ఉంది.
ఇప్పటివరకు దేవుడు ప్రసాదించిన వాటి కొరకు దేవునికి కృతజ్ఞత కలిగియుండునట్లు ప్రోత్సహించున్నాను. అయన దైవ శక్తి జీవమునకు భక్తి కానీ కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గురించిన అనుభవ జ్ఞానము వలన...(2 పేతురు 1:3)
ఈ ప్రణాళిక గురించి
మనము ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఏమి చెప్పుతాము? ంఅన అవసరాల గురించి లేక మన భాధలు, సమట్టుచునామా? ఆయన మనకొరకు చీసిన మేళ్ళకై స్తుతించుచునామ? కృతఙులుగా ఉన్నామ? ఈ మూడు దినముల బైబిల్ స్టడీ మనకు కృతఙత భావం అంటే ఏమిటి అని నేర్పిస్తుంది
More
ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/