మీ పనికి అర్థం చెప్పండినమూనా

Give Your Work Meaning

4 యొక్క 3

పనిలో అన్ని సమయాలలో దేవునిపై ఆధారపడటం

మనము పనిని ఎవరి కొరకు చేస్తున్నాము అనే విషయం మరియు మన పనికి మనం ఇచ్చే అర్థాన్ని ప్రభావితం చేస్తుంది. మనము పని చేసే వ్యక్తులను గౌరవిస్తే మరియు మన సంస్థ పట్ల సానుకూలంగా ఉంటే, మనము మన వంతు కృషి చేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మనలని కించ పరచినప్పుడు లేదా పనిలో ఉన్న వ్యక్తులతో సమస్యలు ఎదురైనప్పుడు, నిరుత్సాహపడటం, విసికిపోవడం మరియు కోప పడటం కూడా సులభం. ప్రజల పట్ల మన తీర్పు మనలని ప్రోత్సహించాలి గాని మన పనిపై ప్రతికూల ప్రభావాన్ని చూపకూడదు.

యోసెపుకు కోపంగా మరియు చేదుగా ఉండటానికి యెన్నో కారణాలు ఉన్నాయి. అతను చేయని పనికి అతను జైలులో వేయ బడ్డాడు. అయినప్పటికీ, యోసెపు దేవునిపై ఆధారపడటం కొనసాగించాడు మరియు వార్డెన్‌కు శ్రేష్ఠమైన సేవ చేశాడు. ఆ కారణంగా, అతను ఖైదీలందరి నిర్వహణా బాధ్యత పొందాడు. అక్కడికి పంపబడిన భక్షదాయకుడు మరియు పానదాయకుడు కలత చెందడం కనిపించినప్పుడు, యోసెపు తన విచారం వ్యక్తపరచాడు. అతను వారిని కలతపెట్టే కలలను వివరించడం విన్నాడు మరియు దేవుడు తనకు చూపించిన వివరణను వారికి అందించాడు. ఎవ్వరూ అర్థం చేసుకోలేని కలతపెట్టే కలలో ఫరో కనిపించిన తర్వాత అతని దయ వల్ల పానదాయకుడు యోసేపును ఫరోకు సిఫార్సు చేశాడు. అప్పుడు కూడా యోసెపు తనను తాను అందంగా చూపించుకోవడానికి ప్రయత్నించలేదు. దేవుడు తప్ప మరెవరూ కలలను అర్థం చెప్పలేరని ఫరోతో చెప్పాడు. అప్పుడు అతను దేవుడు ఇచ్చిన వివరణను అందించాడు.

యోసెపు చెరసాలలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు అతనిని ఐగుప్తు అంతటి మీద అధికారిగా ఉంచాడు (లూకా 16:10). దేవుడు యోసేపుతో ఎల్లప్పుడూ ఉన్నాడు, అతనిని సిద్ధం చేశాడు, అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు మరియు అతని ఉద్దేశాలను నెరవేర్చడానికి పరిస్థితులను రూపొందించాడు.

మన ఉత్తమమైన పనిని చేయాలనే మన ప్రేరణ ఇతరుల ప్రవర్తనల ద్వారా ప్రభావితమైతే, మన ఉత్తమ కృషిని అందించాలనే మన నిబద్ధత హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కానీ మీరు ఎల్లప్పుడూ మీ పనిలో దేవునిపై ఆధారపడినట్లయితే యెలా ఉంటుంది? దేవుని కోసం మన పనిని చేయడం వల్ల స్థిరంగా అద్భుతమైన ఫలితాలు వచ్చేలా మనకు శక్తినిస్తుంది. ఈరోజు పనిలో దేవునిపై ఆధారపడటాన్ని మీరు ఎలా పెంచుకోవచ్చు?

ప్రార్థన

తండ్రీ, ఇతరులపై నా తీర్పు నా పని పట్ల నా వైఖరిని ప్రతికూలంగా ప్రభావితం చేయడానికి నేను అనుమతించిన సమయాల కోసం నన్ను క్షమించు. నేను చేసే పని అంతా నిన్ను గౌరవించటానికి వినియోగిస్తారన్న నమ్మకాన్ని పెంపొందించండి. నా హృదయంలో పని చేయండి, తద్వారా నేను సానుకూల దృక్పథాన్ని కొనసాగించగలను. యేసు నామంలో. ఆమెన్.

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

Give Your Work Meaning

మనం జీవితంలో చాల సమయం మన పనిలోనే గడుపుతాము. మన పనికి అర్థం ఉండాలని- మన పని అవసరం అని మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఒత్తిడి, డిమాండ్లు మరియు ప్రతికూలతల వల్ల పని కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్లాన్, విశ్వాసంతో మీ పనికి సానుకూల అర్థం ఇవ్వగల శక్తి మీకు ఉందని గుర్తించడానికి సహాయపడుతుంది.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వర్క్‌మేటర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.workmatters.org/workplace-devotions/