మీ పనికి అర్థం చెప్పండినమూనా
మన పని యొక్క అర్థం మన ఎంపికలో ఉంది
ఆదికాండము 37:5-7 మరియు 9లో, దేవుడు తన జీవితాన్ని గొప్పగా పిలుచుకోవడం గురించి యోసేపు కలలు కన్నాడు. తన సొంత కుటుంబ సభ్యులు కూడా తనకు తలవంచేలా అధికారంలో ఉండాలని కలలు కన్నాడు. అతని సోదరులు అసూయ చెందారు మరియు వారి తమ్ముడిని వదిలించుకోవాలనుకున్నారు. వారు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు యోసేపు ఒంటరిగా వారిని గూర్చి విచారించడనికి వచ్చినప్పుడు, వారు అవకాశాన్ని చేజిక్కించుకున్నారు మరియు అతనిని బానిసగా విక్రయించారు. మీరు చెప్పవచ్చు, యోసేపు జీవితం ఒక గొప్ప మలుపు తిరిగిందని.
యోసేపు ఒక విదేశంలో బానిసగా పని చేయవలసి వచ్చింది, అక్కడ ప్రజలకు దేవుని పట్ల శ్రద్ధ లేదు, కానీ అతని పని పట్ల అతని వైఖరిని ఎంచుకునే స్వేచ్ఛను వారు తీసివేయలేకపోయారు. యోసేపు తన పాత్రను నిర్వచించనివ్వలేదు. అతని యజమాని పోతీఫరు అయినప్పటికీ, యోసేపు దేవునికి సేవ చేయడాన్ని మరియు తన పనిని శ్రేష్ఠంగా చేయడానికి ఎంచుకున్నాడు. తత్ఫలితంగా, దేవుడు యోసేపు చేసిన ప్రతి పనిలో విజయాన్ని ప్రసాదించాడు మరియు పోతీఫరు యోసేపుకు అతని స్వంతమైన ప్రతిదానిపైన బాధ్యత అప్పగించాడు.
మనందరికీ మనం చేయాలనుకుంటున్న పని గురించి కలలు ఉంటాయి. బహుశా మీరు చేస్తున్న పని మీరు కన్న కలల నుండి చాలా దూరంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, మనమందరం - స్పృహతో లేదా తెలియకుండానే - మన పని ఎలా చేయలో ఎంచుకుంటాము. మన పనికి మనం ప్రాముఖ్యత దాని పట్ల మనకు ఉన్న వైఖరిని నిర్ణయిస్తుంది, ఇది మన పనికి మనం తీసుకువచ్చే నాణ్యత మరియు శ్రేష్ఠతను ప్రభావితం చేస్తుంది మరియు అది దేవుడు మనల్ని ఎలా ఉపయోగించవచ్చో ప్రభావితం చేస్తుంది.
మన పనికి సానుకూల అర్థాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. మనం చేసినప్పుడు, మనం మన పనిని చక్కగా చేయడమే కాకుండా, మనలో క్రీస్తును చూసేందుకు ఇతరులను అవకాశం ఇస్తున్నాము. తత్ఫలితంగా, మన గుర్తింపు క్రీస్తులో ఉంది, మన పనిలో కాదు. ఆయన రాజ్యంలో మీ పనికి ఆయన అర్థాన్ని చూపించమని దేవుని అడగండి.
ప్రార్థన
తండ్రి దేవా, ఈరోజు నీ దృష్టిలో నా పనిని చూసేందుకు నాకు సహాయం చెయ్యి. క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించడానికి నీపై నాకున్న ప్రేమతో నేను చేసే అన్ని పనులనూ మీరు శ్రేష్ఠంగా ఉపయోగిస్తున్నారని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయండి. నాతో పనిచేసే వారు ఈరోజు నాలో క్రీస్తును చూడగలగాలి. యేసు నామంలో. ఆమెన్.
తదుపరి అన్వేషణ కోసం
మన అత్యంత సాధారణ పనిలో ప్రయోజనాన్ని ఎలా కనుగొనాలో ఈ లో కనుగొనండి Workmatters blog.
ఈ ప్రణాళిక గురించి
మనం జీవితంలో చాల సమయం మన పనిలోనే గడుపుతాము. మన పనికి అర్థం ఉండాలని- మన పని అవసరం అని మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఒత్తిడి, డిమాండ్లు మరియు ప్రతికూలతల వల్ల పని కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్లాన్, విశ్వాసంతో మీ పనికి సానుకూల అర్థం ఇవ్వగల శక్తి మీకు ఉందని గుర్తించడానికి సహాయపడుతుంది.
More