1 దినవృత్తాంతములు 6:54-81

1 దినవృత్తాంతములు 6:54-81 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి: యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు. (అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.) అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా, హీలేను, దెబీరు, ఆషాను, యుత్తా, బేత్-షెమెషు, వాటి దాని పచ్చిక మైదానాలతో ఇవ్వబడ్డాయి. బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి. కహాతీయులకు పంచిపెట్టిన మొత్తం పట్టణాల సంఖ్య పదమూడు. కహాతు సంతానంలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్ర వంశస్థుల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు కేటాయించబడ్డాయి. గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి. మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి. ఈ విధంగా ఇశ్రాయేలీయులు, లేవీయులకు ఈ పట్టణాలను వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు. యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిం గోత్ర ప్రదేశాల నుండి సరిహద్దు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఎఫ్రాయిం కొండ సీమలో ఆశ్రయ పట్టణమైన షెకెము, గెజెరు, యొక్మెయాము, బేత్-హోరోను, అయ్యాలోను, గాత్-రిమ్మోను, వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి. మనష్షే అర్ధగోత్రీకుల దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆనేరు, బిలియాము వాటి పచ్చిక మైదానాలతో పాటు కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఇచ్చారు. గెర్షోనీయులకు లభించిన పట్టణాలు: మనష్షే అర్ధగోత్ర ప్రదేశంలో నుండి బాషానులో ఉన్న గోలాను, అష్తారోతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; ఇశ్శాఖారు గోత్ర ప్రదేశంలో నుండి కెదెషు, దాబెరతు, రామోతు, అనేము, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; ఆషేరు గోత్ర ప్రదేశంలో నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు, రెహోబు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుండి గలిలయలో ఉన్న కెదెషు, హమ్మోను, కిర్యతాయిము వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు. లేవీయులలో మిగిలిన వారైన మెరారీయులకు లభించిన పట్టణాలు: జెబూలూను గోత్ర ప్రదేశంలో నుండి యొక్నెయాము, కర్తహు, రిమ్మోను, తాబోరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు, కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము, హెష్బోను, యాజెరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.

1 దినవృత్తాంతములు 6:54-81 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది. దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది. అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు. అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ, హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ. అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి. ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి. కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి. గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది. మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు. వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు. కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ, యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ, అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు. అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు. అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ, ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ, రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ, ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ, హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ, నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు. ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు. ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ, కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు. అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ, హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.

1 దినవృత్తాంతములు 6:54-81 పవిత్ర బైబిల్ (TERV)

అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని వారు నివసించారు. లేవీయులకియ్యబడిన భూముల్లో కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది. వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు ప్రక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది. కాని పట్టణానికి దూరంగావున్న భూములు, హెబ్రోను పట్టణానికి దగ్గరలో వున్న గ్రామాలు కాలేబుకు ఇవ్వబడ్డాయి. కాలేబు తండ్రి పేరు యెపున్నె. అహరోను సంతతివారికి హెబ్రోను నగరం ఇవ్వబడింది. హెబ్రోను ఆశ్రయపురం వారికింకా లిబ్నా, యత్తీరు, ఎష్టెమో, హీలేను, దెబీరు, ఆషాను, యుట్ట, బేత్షెమెషు నగరాలు కూడ ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు వాటి సమీపంలోని పచ్చిక బయళ్ళు కూడ వారికియ్యబడ్డాయి. బెన్యామీను సంతతి వారికి గిబియోను, గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల వారికియ్యబడ్డాయి. కహాతు సంతతి వారైన వంశాల వారికి మనష్షే వంశం వారి సగంమందికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి. గెర్షోను సంతతి వారైన వంశాల వారికి పదమూడు నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషాను ప్రాంతాలలో నివసించే కొందరికి మనష్షే వారినుండి సంక్రమించాయి. మెరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి వచ్చాయి. వారికి ఆ నగరాలు చీట్లువేసి ఇచ్చారు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాలను, పొలాలను లేవీయులకు ఇచ్చారు. పైన పేర్కొనబడిన ఆ నగరాలన్నీ చీట్లువేసి యూదా, షిమ్యోను, బెన్యామీను కుటుంబాల వారినుండి తీసుకొనబడి వారికియ్యబడ్డాయి. ఎఫ్రాయిము వంశం వారు కూడ కొందరు కహాతీయుల కుటుంబాల వారికి కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఈ పట్టణాలను కూడ చీట్లువేసి ఇచ్చారు. వారికి షెకెము నగరం ఇవ్వబడింది. షెకెము కూడ ఒక రక్షణ (ఆశ్రయ) నగరం. వారికి ఇంకను గెజెరు, యొక్మెయాము, బేత్‌హోరోను, అయ్యాలోను, మరియు గత్రిమ్మోను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో వున్నాయి. సగం మనష్షే గోత్రం వారి నుండి ఆనేరు, బిలియాము పట్టణాలను ఇశ్రాయేలు వారు తీసుకొని కహాతీయులకు ఇచ్చారు. పట్టణాలతో పాటు కహాతీయులకు పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. గెర్షోను ప్రజలకు బాషాను ప్రాంతంలోని గోలాను పట్టణం, మనష్షే సగం వంశం వారి నుండి అష్తారోతు పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. గెర్షోను కుటుంబాల వారికి ఇశ్శాఖారు వంశం నుంచి కెదెషు, దాబెరతు, రామోతు మరియు ఆనేము అను పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల సమీపంలో గల భూములు కూడ వారికివ్వబడ్డాయి. గెర్షోను ప్రజలకు ఆషేరు వంశం నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు మరియు రెహాబు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల పరిసరాలలోగల భూములు కూడ వారికివ్వబడ్డాయి. గెర్షోను వారు నఫ్తాలి వంశం నుండి గలిలయలోని కెదెషు, హమ్మోను మరియు కిర్యతాయిము పట్టణాలను పొందారు. ఆ పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. మిగిలిన లేవీయులైన మెరారీయులకు జెబూలూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి. మెరారీయులు రూబేను వంశం నుండి అరణ్య ప్రాంతంలోని బేసెరు, యహజా, కెదేమోతు మరియు మేఫాతు పట్టణాలను పొందారు. రూబేను వంశస్థులు యొర్దాను నదికి తూర్పున, యెరికో నగరానికి తూర్పున నివసించారు. మెరారీయులకు పట్టణాలతో పాటు పరిసర భూములు కూడ ఇవ్వబడ్డాయి. మెరారీయులు ఇంకను గాదు వంశం నుండి గిలాదు నందలి రామోతు, మహనయీము, హెష్బోను మరియు యాజెరు పట్టణాలను పొందారు. వారికి పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.

1 దినవృత్తాంతములు 6:54-81 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావు లనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి. యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు. మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లె మెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు. కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్రస్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్రస్థానములోనుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థానములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములోనుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములోనుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును, యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును, అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇశ్శాఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు; నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగాఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను.

1 దినవృత్తాంతములు 6:54-81 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)