1 దినవృత్తాంతములు 6
6
లేవీ
1లేవీ కుమారులు:
గెర్షోను, కహాతు, మెరారి.
2కహాతు కుమారులు:
అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
3అమ్రాము పిల్లలు:
అహరోను, మోషే, మిర్యాము.
అహరోను కుమారులు:
నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
4ఎలియాజరు ఫీనెహాసుకు తండ్రి,
ఫీనెహాసు అబీషూవకు తండ్రి,
5అబీషూవ బుక్కీకి తండ్రి,
బుక్కీ ఉజ్జీకి తండ్రి,
6ఉజ్జీ జెరహ్యాకు తండ్రి,
జెరహ్యా మెరాయోతుకు తండ్రి,
7మెరాయోతు అమర్యాకు తండ్రి,
అమర్యా అహీటూబుకు తండ్రి,
8అహీటూబు సాదోకుకు తండ్రి,
సాదోకు అహిమయస్సుకు తండ్రి,
9అహిమయస్సు అజర్యాకు తండ్రి,
అజర్యా యోహానానుకు తండ్రి,
10యోహానాను అజర్యాకు తండ్రి,
సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.
11అజర్యా అమర్యాకు తండ్రి,
అమర్యా అహీటూబుకు తండ్రి,
12అహీటూబు సాదోకుకు తండ్రి,
సాదోకు షల్లూముకు తండ్రి,
13షల్లూము హిల్కీయాకు తండ్రి,
హిల్కీయా అజర్యాకు తండ్రి,
14అజర్యా శెరాయాకు తండ్రి,
శెరాయా యెహోజాదాకుకు#6:14 హెబ్రీలో యోజాదాకు 15 వచనంలో కూడా తండ్రి.
15యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.
16లేవీ కుమారులు:
గెర్షోను,#6:16 హెబ్రీ గెర్షోము గెర్షోను యొక్క మరొక రూపం 17, 20, 43, 62, 71 వచనంలో కూడా కహాతు, మెరారి.
17గెర్షోను కుమారుల పేర్లు ఇవి:
లిబ్నీ, షిమీ.
18కహాతు కుమారులు:
అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
19మెరారి కుమారులు:
మహలి, మూషి.
వారి తండ్రుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఇవే:
20గెర్షోను:
అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు యహతు,
అతని కుమారుడు జిమ్మా, 21అతని కుమారుడు యోవాహు,
అతని కుమారుడు ఇద్దో, అతని కుమారుడు జెరహు,
అతని కుమారుడు యెయతిరయి.
22కహాతు సంతానం:
అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు,
అతని కుమారుడు అస్సీరు, 23అతని కుమారుడు ఎల్కానా,
అతని కుమారుడు ఎబ్యాసాపు, అతని కుమారుడు అస్సీరు,
24అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఊరియేలు,
అతని కుమారుడు ఉజ్జియా, అతని కుమారుడు షావూలు.
25ఎల్కానా సంతానం:
అమాశై, అహీమోతు,
26అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు జోఫై,
అతని కుమారుడు నహతు, 27అతని కుమారుడు ఏలీయాబు,
అతని కుమారుడు యెరోహాము, అతని కుమారులు ఎల్కానా,
అతని కుమారుడు సమూయేలు.#6:27 కొ.ప్ర.లలో (1 సమూ 1:19,20, 1 దిన 6:33-34 చూడండి), హెబ్రీలో, సమూయేలు అతని కుమారుడు అని లేదు
28సమూయేలు కుమారులు:
మొదటివాడు యోవేలు#6:28 కొ.ప్ర.లలో (1 సమూ 8:2, 1 దిన 6:33 చూడండి), హెబ్రీలో యోవేలు అని లేదు
రెండవవాడు అబీయా.
29మెరారి సంతానం:
మహలి, అతని కుమారుడు లిబ్నీ,
అతని కుమారుడు షిమీ, అతని కుమారుడు ఉజ్జా,
30అతని కుమారుడు షిమ్యా, అతని కుమారుడు హగ్గీయా,
అతని కుమారుడు అశాయా.
ఆలయ సంగీతకారులు
31నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు. 32సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.
33తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు:
కహాతీయుల నుండి:
సంగీతకారుడైన హేమాను,
హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,
34అతడు ఎల్కానా కుమారుడు, అతడు యెరోహాము కుమారుడు,
అతడు ఎలీయేలు కుమారుడు, అతడు తోయహు కుమారుడు,
35అతడు సూఫు కుమారుడు, అతడు ఎల్కానా కుమారుడు,
అతడు మహతు కుమారుడు అతడు అమాశై కుమారుడు,
36అతడు ఎల్కానా కుమారుడు, అతడు యోవేలు కుమారుడు,
అతడు అజర్యా కుమారుడు, అతడు జెఫన్యా కుమారుడు,
37అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు,
అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,
38అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు,
అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;
39హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి:
ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు,
40అతడు మిఖాయేలు కుమారుడు, అతడు బయశేయా#6:40 కొ.ప్ర.లలో మయశేయా కుమారుడు,
అతడు మల్కీయా కుమారుడు, 41అతడు యెత్నీ కుమారుడు,
అతడు జెరహు కుమారుడు, అతడు అదాయా కుమారుడు,
42అతడు ఏతాను కుమారుడు, అతడు జిమ్మా కుమారుడు,
అతడు షిమీ కుమారుడు, 43అతడు యహతు కుమారుడు,
అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;
44హేమాను ఎడమ ప్రక్కన మెరారీయులు సేవ చేశారు:
ఏతాను కీషీ కుమారుడు, అతడు అబ్దీ కుమారుడు,
అతడు మల్లూకు కుమారుడు, 45అతడు హషబ్యా కుమారుడు,
అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,
46అతడు అమ్జీ కుమారుడు, అతడు బానీ కుమారుడు,
అతడు షమెరు కుమారుడు, 47అతడు మహలి కుమారుడు,
అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు,
అతడు లేవీ కుమారుడు.
48వారి తోటి లేవీయులు దేవుని మందిరమనే ప్రత్యక్షగుడారంలో జరగాల్సిన ఇతర పనులన్నిటి కోసం నియమించబడ్డారు. 49అయితే అహరోను అతని సంతానం దహనబలిపీఠం మీద ధూపవేదిక మీద అర్పణలు అర్పించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో చేయవలసిన వాటన్నిటిని చేయడానికి, దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన ప్రకారం ఇశ్రాయేలు కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నియమించబడ్డారు.
50వీరు అహరోను సంతానం:
అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు,
అతని కుమారుడు అబీషూవ, 51అతని కుమారుడు బుక్కీ,
అతని కుమారుడు ఉజ్జీ, అతని కుమారుడు జెరహ్యా,
52అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా,
అతని కుమారుడు అహీటూబు, 53అతని కుమారుడు సాదోకు,
అతని కుమారుడు అహిమయస్సు.
54అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి:
55యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు. 56(అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.) 57అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా, 58హీలేను, దెబీరు, 59ఆషాను, యుత్తా,#6:59 యెహో 21:16 చూడండి; యుత్తా హెబ్రీలో ఈ పదం లేదు. బేత్-షెమెషు, వాటి దాని పచ్చిక మైదానాలతో ఇవ్వబడ్డాయి.
60బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను,#6:60 యెహో 21:17 చూడండి; గిబియోను హెబ్రీలో ఈ పదం లేదు గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.
కహాతీయులకు పంచిపెట్టిన మొత్తం పట్టణాల సంఖ్య పదమూడు.
61కహాతు సంతానంలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్ర వంశస్థుల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు కేటాయించబడ్డాయి.
62గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి.
63మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి.
64ఈ విధంగా ఇశ్రాయేలీయులు, లేవీయులకు ఈ పట్టణాలను వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు.
65యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి.
66కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిం గోత్ర ప్రదేశాల నుండి సరిహద్దు పట్టణాలు ఇవ్వబడ్డాయి.
67ఎఫ్రాయిం కొండ సీమలో ఆశ్రయ పట్టణమైన షెకెము, గెజెరు, 68యొక్మెయాము, బేత్-హోరోను, 69అయ్యాలోను, గాత్-రిమ్మోను, వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.
70మనష్షే అర్ధగోత్రీకుల దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆనేరు, బిలియాము వాటి పచ్చిక మైదానాలతో పాటు కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఇచ్చారు.
71గెర్షోనీయులకు లభించిన పట్టణాలు:
మనష్షే అర్ధగోత్ర ప్రదేశంలో నుండి బాషానులో ఉన్న గోలాను, అష్తారోతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
72ఇశ్శాఖారు గోత్ర ప్రదేశంలో నుండి కెదెషు, దాబెరతు, 73రామోతు, అనేము, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
74ఆషేరు గోత్ర ప్రదేశంలో నుండి మాషాలు, అబ్దోను, 75హుక్కోకు, రెహోబు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
76నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుండి గలిలయలో ఉన్న కెదెషు, హమ్మోను, కిర్యతాయిము వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
77లేవీయులలో మిగిలిన వారైన మెరారీయులకు లభించిన పట్టణాలు:
జెబూలూను గోత్ర ప్రదేశంలో నుండి యొక్నెయాము, కర్తహు, రిమ్మోను, తాబోరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
78యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు, 79కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
80గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము, 81హెష్బోను, యాజెరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 దినవృత్తాంతములు 6: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.