1 దినవృత్తాంతములు 6:54-81

1 దినవృత్తాంతములు 6:54-81 TSA

అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి: యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు. (అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.) అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా, హీలేను, దెబీరు, ఆషాను, యుత్తా, బేత్-షెమెషు, వాటి దాని పచ్చిక మైదానాలతో ఇవ్వబడ్డాయి. బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి. కహాతీయులకు పంచిపెట్టిన మొత్తం పట్టణాల సంఖ్య పదమూడు. కహాతు సంతానంలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్ర వంశస్థుల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు కేటాయించబడ్డాయి. గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి. మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి. ఈ విధంగా ఇశ్రాయేలీయులు, లేవీయులకు ఈ పట్టణాలను వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు. యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిం గోత్ర ప్రదేశాల నుండి సరిహద్దు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఎఫ్రాయిం కొండ సీమలో ఆశ్రయ పట్టణమైన షెకెము, గెజెరు, యొక్మెయాము, బేత్-హోరోను, అయ్యాలోను, గాత్-రిమ్మోను, వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి. మనష్షే అర్ధగోత్రీకుల దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆనేరు, బిలియాము వాటి పచ్చిక మైదానాలతో పాటు కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఇచ్చారు. గెర్షోనీయులకు లభించిన పట్టణాలు: మనష్షే అర్ధగోత్ర ప్రదేశంలో నుండి బాషానులో ఉన్న గోలాను, అష్తారోతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; ఇశ్శాఖారు గోత్ర ప్రదేశంలో నుండి కెదెషు, దాబెరతు, రామోతు, అనేము, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; ఆషేరు గోత్ర ప్రదేశంలో నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు, రెహోబు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుండి గలిలయలో ఉన్న కెదెషు, హమ్మోను, కిర్యతాయిము వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు. లేవీయులలో మిగిలిన వారైన మెరారీయులకు లభించిన పట్టణాలు: జెబూలూను గోత్ర ప్రదేశంలో నుండి యొక్నెయాము, కర్తహు, రిమ్మోను, తాబోరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు, కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు; గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము, హెష్బోను, యాజెరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.