కీర్తనలు 64
64
కీర్తన 64
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
1నా దేవా, నా ఫిర్యాదు వినండి;
శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.
2దుష్టుల కుట్ర నుండి,
కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.
3వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు
మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.
4చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు.
వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.
5కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు.
వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు;
వారంటారు, “దీన్ని#64:5 లేదా మనల్ని ఎవరు చూస్తారు?”
6వారు అన్యాయాలను రూపొందించి అంటారు,
“మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!”
నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.
7కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు;
వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.
8ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి
వారిని పతనానికి తెస్తారు;
వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.
9మనుష్యులందరు భయపడతారు;
దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు
ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.
10నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక.
ఆయననే ఆశ్రయించెదరు గాక.
యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 64: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.