కీర్తనలు 65
65
కీర్తన 65
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము.
1మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు;
మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము.
2మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు,
ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.
3మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు,
మీరు మా అతిక్రమాలను క్షమించారు#65:3 లేదా ప్రాయశ్చిత్తం చేశారు.
4మీ ఆవరణాల్లో నివసించడానికి
మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు!
మీ పరిశుద్ధ మందిరం యొక్క,
మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం.
5మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు,
దేవా మా రక్షకా,
భూదిగంతాలన్నిటికి
సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ.
6బలమును ఆయుధంగా ధరించుకొని,
మీరు మీ మహాశక్తితో పర్వతాలను సృజించారు.
7సముద్రం యొక్క హోరును,
అలల యొక్క ఘోషను
దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే.
8భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు;
ఉదయం సాయంత్రాలను మీరు
ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు.
9మీరు భూమిని గమనించి నీరు పోస్తారు;
మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు.
ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి
దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి
ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు.
10మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు.
మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు.
11మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు,
మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి.
12అరణ్యం యొక్క తుక్కు భూములు పొంగిపొర్లుతాయి;
కొండలు ఆనందాన్ని ధరించుకొని ఉన్నాయి.
13పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి
లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి;
వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 65: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.