కీర్తనలు 61

61
కీర్తన 61
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
1ఓ దేవా! నా మనవి వినండి;
నా ప్రార్థన ఆలకించండి.
2భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను,
నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను;
నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.
3ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం,
శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.
4మీ గుడారంలో చిరకాలం నివసించాలని
మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా
5దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు;
మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు.
6రాజు జీవితకాల దినాలను పొడిగించండి,
అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి.
7అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు;
మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి.
8అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను
దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 61: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి